మహాశివరాత్రి కానుకగా విజయ్‌ ఆంటోని ‘యమన్‌’

Yaman 04-02-2017విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారకా క్రియేషన్స్‌ పతాకాలపై జీవశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యమన్‌’ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 11న ఆడియో
ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నకిలి, డా|| సలీం, బిచ్చగాడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్‌ ఆంటోనిగారికి ‘యమన్‌’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని పెర్‌ఫార్మెన్స్‌, ఆయన అందించిన మ్యూజిక్‌ చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి 11న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *