'బాహుబలి' ఆండగా నందమూరి అభిమానులు..!

11264818_981708118548015_950867699195475069_nహిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ‘బాహుబలి’కి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మొన్న తిరుపతిలో జరిగిన ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్‌ నిర్వహణకు అనుమతులు మొదలుకొని.. నిన్న సినిమా విడుదలై బెన్‌ఫిట్‌ షోల నిర్వహణ వరకు అన్నీ బాలకృష్ణ వెనుక వుండి చూసుకున్నారు. బాలయ్య వున్నట్టుండి ఎందుకు ‘బాహుబలి’కి సపోర్ట్‌ చేస్తున్నాడనే వారూ లేకపోలేదు. అయితే ఇదంతా తనయుడు నందమూరి మోక్షజ్ఞ కోసమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇంకా రెండేళ్ళ వరకు మోక్షజ్ఞ తెరంగేట్రం లేదు. ఈ లోగా… ‘బాహుబలి2′ పూర్తవుతుంది. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్‌లో మోక్షజ్ఞని తెరంగేట్రం చేయాలనే ఆలోచనతో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే… నందమూరి నాలుగోతరం వారసుడు కూడా బ్లాక్‌ బస్టర్‌తో రికార్డులు మోగిస్తాడన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *