టీచ‌ర్స్ నియోజ‌వ‌ర్గాల‌లో టీడీపీకి చెంపదెబ్బ!

23

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యానందం ఆవిర‌య్యేరీతిలో ఫ‌లితాలున్నాయి. ప్ర‌తిప‌క్ష పీడీఎఫ్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. అందులో టీడీపీ త‌రుపున బ‌రిలో ఉన్న బ‌చ్చ‌ల పుల‌య్య ప‌శ్చిమ రాయ‌ల‌సీమ స్థానంలో మూడో స్థానంలో ఉండ‌డం పాల‌క‌పార్టీని క‌ల‌క‌లం రేపుతోంది. అక్క‌డ పీడీఎఫ్ త‌రుపున బ‌రిలో ఉన్న క‌త్తి న‌ర్సింహ‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కాగా తూర్పు రాయ‌ల‌సీమ పీఠాన్ని పీడీఎఫ్ అభ్య‌ర్థి కైవ‌సం చేసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠ‌పు బాల‌సుబ్ర‌హ్మణ్యం మూడో సారి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. తొలుత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన ఆయ‌న ఆత‌ర్వాత వ‌రుస‌గా రెండు సార్లు ఉపాధ్యాయ స్థానం నుంచి గెలిచిన‌ట్ట‌య్యింది. దాంతో ప్ర‌స్తుత ఎమ్మెల్సీల‌లో మూడోసారి ఎమ్మెల్సీగా ఉన్న సీనియ‌ర్ గా వీబీఎస్ నిలిచారు. ఆయ‌న భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్య‌ర్థిని మ‌ట్టిగ‌రిపించారు. సుమారు మూడు వేల‌కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపొందిన వీబీఎస్ ను ప‌లువురు ఉపాధ్యాయులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here