రివ్యూ: ఉగ్రవాదాన్ని ఎదిరించే… మా అబ్బాయి!

199

తారాగణం: శ్రీ విష్ణు, చిత్ర శుక్
సంగీతం : సురేష్ బొబ్బిలి
నిర్మాతలు : బలగా ప్రకాష్ రావ్
దర్శకత్వం : కుమార్ వట్టి
రేటింగ్: 3/5
శ్రీ విష్ణు మొన్నటి వరకు కమర్షియల్ హీరోగా ట్రై చేయలేదు. అయితే అప్పట్లో ఒకడుండేవాడు మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ‘మా అబ్బాయి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటి వరకు వేరే హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీవిష్ణు.. తొలిసారిగా సోలో హీరోగా ఈ సినిమాతో మన ముందుకొచ్చాడు. మరి మా అబ్బాయి మూవీ ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
స్టోరీ: సరదాగా కుటుంబంతో హీయిగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు శ్రీవిష్ణు. అదే కాలనీలో వుంటున్న చిత్ర శుక్లను ప్రేమిస్తుంటాడు. ఆమెను తన వైపు ఎప్పుడెప్పుడు తిప్పుకోవాలా అనిచూస్తుంటాడు. ఇలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుండగానే… తమ కాలనీలో వున్న సాయిబాబా టెంపుల్ వద్ద వరుస బాంబు పేళుల్లు సంభవిస్తాయి. ఆ పేళుల్లలో తన కుటుంబాన్ని మొత్తం కోల్సోతాడు. దాంతో అప్పటి నుంచి పేళుల్లకు కారణమైన వారిని పట్టుకునే పనిలో పడతాడు శ్రీవిష్ణు. ఇంతరకు పేళుల్లకు పాల్పడింది ఎవరు? వారిని హీరో పట్టుకున్నాడా? పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాన్ని పన్నాడు అనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: ఇందులో శ్రీవిష్ణు సోలో హీరోగా తొలిసారిగా నటించి మెప్పించాడు. కుటుంబం.. ప్రేమ.. ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు చక్కగా ఒదిగిపోయారు. ఎందుకంటే… అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో కూడా ఇంచు మించు ఇలాంటి పాత్రనే పోషించాడు. ఇప్పుడు కూడా కొంత తెలివైన కుర్రాడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. తన కుటుంబం మొత్తం ఉగ్రవాదులు పేల్చిన పేలుళ్లలో హతం కావడం… అప్పటి వరకు కళ్ల ముందే వున్న అమ్మా.. నాన్న.. చెల్లి చనిపోవడంతో అనాథగా మారిపోయిన హీరో… కాసేపటికే తేరుకుని వారి భరతం పట్టడానికి సంకల్పించే హీరో పాత్రలో శ్రీవిష్ణు పలికించిన హావభవాలు బాగున్నాయి. సెంటిమెంటు.. ప్రేమను.. యాక్షన్ ఇలా అన్ని అంశాల్లోనూ మంచి నటనను కనబరిచాడు. దర్శకుడు కుమార్ వట్టి రాసుకున్న కథ… కథనం బాగుంది. హైదరాబాదులో తరచుగా సంభవించే పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో అందరికీ వెంటనే కనెక్ట్ అవుతుంది.
ఇక ఇందులో హీరోయిన్ అందాలు కూడా బాగానే ఆరబోసింది. బీచ్ సాంగులోనైతే.. ఆమె అందాలు కుర్రకారుకు మతిపోగొడతాయి. హీరో.. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. పాటలన్నీ బాగున్నాయి. ఓ వైపు లవ్ ట్రాక్ నడుపుతూనే… మరో వైపు ద్వితీయార్థంలో తీవ్రవాదులను పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు.. పై ఎత్తులన్నీ చాలా ఎగ్జైటింగ్ గా వుంటాయి. ఎక్కడా మూవీ ఆగకుండా ఫాస్ట్ గా సాగిపోతుంది. క్లైమాక్స్ కాస్త భిన్నంగా వుండేలా చూసుకున్నాడు దర్శకుడు. రొటీన్ హీరో వెళ్ల అందరినీ అంతం చేయకుండా సాయిబాబా సాంగ్ బ్యాక్ డ్రాప్ లో రౌడీలను ప్రజలే మట్టుబెట్టడం భిన్నంగా వుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ రాసుకుని వుంటే కచ్చితంగా శ్రీవిష్ణు కెరీర్ కు ఈ సినిమా ఉపయోగపడేది. హీరోకు తగ్గట్టు సంభాషణలు కూడా బాగా రాసుకున్నాడు. సంగీతం బాగుంది. రొమాంటిక్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా వుంది. హీరోయిన్ ను చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. ద్వితీయార్థాన్ని బాగా ట్రిమ్ చేయడంతో తొందరగా ముగిసిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాత బాగా ఖర్చు చేయడంతో నిర్మాణ విలువల చాలా రిచ్ గా వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here