పోలీసుశాఖకు 30 కమ్యూనికేషన్ సెట్ ల పంపిణి

50

భద్రతకే  నిఘా పటిష్టం చేయడం కోసం ఆధునిక టెక్నాలజీ కలిగిన అడ్వాన్స్ డ్ కమ్యూనికేషన్ సెట్ లను (Man pack’s ) పోలీసుసిబ్బందికి పంపిణి చేస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి గారు అన్నారు. ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు ట్రాఫిక్ పోలీసులకు మరియు అన్ని సబ్ డివిజన్ లకు కమ్యూనికేషన్ సెట్ లు పంపిణి చేశారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…. పోలీసుశాఖకు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. ఏదైనా సమాచారం కొరకు వేగంగా స్పందించే విధంగా అడ్వాన్స్ డ్ కమ్యూనికేషన్ సెట్ లు ఉపయోగపడతాయన్నారు. ఈ కమ్యూనికేషన్ సెట్ లు Motrola company కి చెందినవన్నారు. జిల్లాలో కమ్యూనికేషన్ సెట్ లు తక్కువగా ఉన్నా కారణంగా వీటిని తెప్పించడం జరిగిందన్నారు. త్వరలో ప్రభుత్వం నుండి మరిన్ని కమ్యూనికేషన్ సెట్లు తెప్పించి కొరత లేకుండా పోలీసుసిబ్బందికి పంపిణీ చేస్తామన్నారు.
ఒక్కో సబ్ డివిజన్ కు 4 సెట్ల చొప్పున మొత్తం 24(ఆదోని, ఆత్మకూరు, ఆళ్ళగడ్డ ,డోన్ , కర్నూలు , నంద్యాల సబ్ డివిజన్) పంపిణి చేసామన్నారు. కర్నూలు ట్రాఫిక్ సిబ్బందికి మాత్రం 6 కమ్యూనికేషన్ సెట్ లు పంపిణి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిస్పీ శ్రీ సి.ఎమ్. గంగయ్య, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీ నజీముద్దీన్ , కమ్యూనికేషన్ సిఐ శ్రీ రామంజనేయులు, ట్రాపిక్ సిబ్బంది ఉన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here