బాంబు పేలుడు కేసును సవాలుగా తీసుకోని చేధిస్తాం..డిఐజి ఘట్టమనేని

82

కర్నూలు నగర సమీపంలో ప్రేలుడు జరిగిన సంఘటన స్ధలాన్ని శుక్రవారం ఉదయం కర్నూలు డిఐజి శ్రీ ఘట్టమనేని శ్రీనివాస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి గారితో కలిసి పరిశీలించారు. ఈ సంధర్బంగా విలేకరులతో కర్నూలు రేంజ్ డిఐజి గారు మాట్లాడుతూ…ఈ సంఘటన ఇదివరకే అందరికి తెలిసిన విషయమేనన్నారు. కర్నూలు నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్ళే దారి లో డంపింగ్ యార్డు సమీపంలోని పక్కన పొలాల్లో ఒక పేలుడు(బ్లాస్టింగ్) సంభవించిందన్నారు. ఈ సంఘటనలో జంపాల కుటుంబ సభ్యులు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారన్నారు. వారి భూమిని సర్వే చేయించుకోవాలని వచ్చి ఒక మూలకు చెత్త అంతా తీసుకుంటూ వచ్చి దానిని అంటించారన్నారు. మంట పెట్టిన వెంటనే వేడి తీవ్రత ఎక్కువై అక్కడ ఉన్న ఎక్స్ ప్లోజివ్ పేలడం జరిగిందన్నారు.
ఈ విషయంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నామన్నారు. ఈ డంప్ యార్డును పూర్తిగా తనిఖీ చేస్తామన్నారు. ఇంకా ఎక్కడైనా ఎక్స్ ప్లోజివ్ ఉన్నాయా అని యాంటి సబ్ చెక్, బాంబ్ డిస్పోజబుల్ టీమ్ తో పరిశీలిస్తున్నామన్నారు. డంప్ యార్డును సీలు చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు. యాంటిసబ్ చెక్ చేసిన తర్వాత డంప్ యార్డును రీలీజ్ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు శ్రీ జె.బాబు ప్రసాద్, శ్రీ యుగంధర్ బాబు, శ్రీ సి.ఎమ్. గంగయ్య, సిఐలు శ్రీ ఆర్ .జి సుబ్రమణ్యం, శ్రీ లక్ష్మీకాంత రెడ్డి, బాంబ్ డిస్పోజబుల్ బృందాలు, బృందం ఉన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here