• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శబరి’

admin by admin
September 26, 2022
in movies
0 0
0
కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శబరి’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. తాజాగా కొడైకెనాల్‌లో రెండు వారాల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ”ఈ రోజు అనిల్ గారి దర్శకత్వం, మహేంద్ర గారి నిర్మాణంలో చేస్తున్న ‘శబరి’ కొడైకెనాల్ షెడ్యూల్ లాస్ట్ డే. మహేంద్రనాథ్ గారి లాంటి నిర్మాత లభించడం చాలా అదృష్టం. నేను పని చేసిన నిర్మాతల్లో ఆయనొక మంచి నిర్మాత. కొడైకెనాల్, విశాఖ, హైదరాబాద్… చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం.సినిమా బాగా వస్తోంది. ‘శబరి’లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మైమ్ గోపి గారితో నాకు నాలుగో చిత్రమిది. గణేష్ వెంకట్రామన్ కూడా సినిమాలో ఉన్నారు. చిన్నపాప నువేక్షా నా కుమార్తె పాత్రలో నటించింది. ఆ చిన్నారి నాకు బాగా క్లోజ్ అయ్యింది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, మీ ముందుకు సినిమా ఎప్పుడు తీసుకు వద్దామా? అని ఎదురు చూస్తున్నాను” అని చెప్పారు.

చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ “కొడైకెనాల్ షెడ్యూల్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొన్నారు. అక్కడ 14 రోజులు షూటింగ్ చేశాం. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఒక పాట, క్లైమాక్స్ షూట్ చేశాం. ఫైట్ మాస్టర్స్ నందు – నూర్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్స్ తీశాం. పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో విశాఖ షెడ్యూల్ ప్రారంభిస్తాం. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి కొత్త పాత్ర ‘శబరి’లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. సినిమాలో అన్ని సాంగ్స్ రికార్డ్ చేశాం. చిత్ర గారు, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, అమ్రితా సురేష్ పాటలను ఆలపించారు” అని చెప్పారు.

దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ “కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లి పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ లేడీగా కనిపిస్తారు. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, కూతురి క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి, కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరి సైన్యంలాపోరాడే జననిగా, మునుపెన్నడూ చేయనటువంటి  భావోద్వేగాలున్న పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా పోషించారు. క్రైమ్ నేపథ్యంలో ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది” అని అన్నారు.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం:
ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Tags: Kodaikanal schedule of 'Sabari' produced by Maha Movies under the direction of Anil Katz with Varalakshmi Sarath Kumar is complete
Previous Post

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

Next Post

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

Next Post
శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ‘పరారీ’
movies

ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ‘పరారీ’

by admin
March 30, 2023
0

...

Read more
పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

March 28, 2023
నమ్మకమైన లావోరా…. మీ పెట్టుబడికి పదింతల ఆదాయం…

నమ్మకమైన లావోరా…. మీ పెట్టుబడికి పదింతల ఆదాయం…

March 28, 2023
‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

March 22, 2023
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In