రివ్యూ: యూత్  మెచ్చే ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’

395

యూత్ ని టార్గెట్ చేసి ఈ మధ్య చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎందుకంటే.. ఇలాంటి సినిమాలకు మినిమం గ్యారంటీ వుంటుందనే భావన చిత్ర సీమలో ఉంది. అందుకే.. కొంత ట్రెండ్ ని ఫాలో అవుతూ.. కాస్త అండర్ కరెంట్ మెసేజ్ ఇస్తే చాలు ఇలాంటి సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అయిపోతుందని… నిర్మాతలు.. దర్శకులు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కిందే ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్రం యూత్ ని ఏమాత్రం ఆకుట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ఇందులో రెండు కథలు సమాంతరంగా సాగి… ఆఖరులో ఈ రెండు కథలకు లింకప్ చేయడమే అసలు ట్విస్ట్. ఓ జర్నలిస్ట్ యువకుడు…డ్రగ్స్ కి ఆడిక్ట్ అయిన యువతికి మధ్య ఉండే లివింగ్ రిలేషన్… దానివల్ల జరిగే పరిణామాలను ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో  ఓ వైపు నడుపుతూనే.. మరో వైపు ప్రాస్టిట్యూట్ వృత్తిలో ఉన్న అమ్మాయి.. డ్రగ్స్ అమ్మే వ్యక్తి ల మధ్య మరో కథను నడిపి… వీరి జీవితాల్లోకి కథానాయకు ఎలా ఎంటర్ అయ్యి కథను క్లైమాక్స్ కు చేర్చాడనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే టైటిల్ చూడగానే యూత్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయని  అనిపిస్తుంది. దాంతో టైటిల్ కార్డుతోనే చిత్ర యూనిట్ యూత్ మదిని యాభై శాతం గెలిచేసింది. ఆ తరువాత విడుదల చేసిన ట్రైలర్ తో.. యూత్ మొత్తం ఈ సినిమాపై కాన్సంట్రేట్ చేసేలా చేశారు. ఎస్. ట్రైలర్ ఇప్పటికే  పాపులర్ అయ్యింది. ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో  కాసింత డోస్ పెంచి వదిలాడు. దాంతో యూత్ బాగా కనెక్ట్ అయింది. దానిని క్యాష్ చేసుకోవడానికి చిత్ర బృందం సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసింది. ధృవ ప్రొడక్షన్ బ్యానర్లో కార్తీక్ మెడికొండ దర్శకత్వంలో సుజన్ నిర్మించిన చిత్రమిది. కిరణ్, హర్షద కులకర్ణి, గాయత్రీ గుప్త ఇందులో పోటీ పడి నటించారు. అంతే కాదు… బడ్జెట్ తక్కువే అయినా.. మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. అందుకే ఈ సినిమా తెరపై రిచ్ గా కనిపిస్తుంది

క్వాలిటీతో తీశామన్నదే ముఖ్యం. ఇందులో నటీనటులు  కొత్తవారైనప్పటికీ ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు కార్తీక్ కూడా పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తాను ఎంచుకున్న స్క్రీన్ ప్లేనే సినిమాకు బలం. ఈ తరహా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అలాంటిది ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారీటీగా సీన్స్ ని తెరమీద చూపించాడు. తక్కువ పాత్రలే అయినప్పటికీ బోర్ కొట్టకుండా  రకరకాల ఎమోషన్స్ ని చూపించగలిగాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. షార్ప్ ఎడిటింగ్, నిర్మాణ విలువలు మరో ప్లస్ పాయింట్స్. డైలాగ్స్ ని నాచురల్ గా రాసుకున్నారు. సినిమాటిక్ గా కాకుండా జనరల్ గా మాట్లాడుకున్నట్టుగా తెరమీద కనబడతాయి.
నిజానికి సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. డ్రగ్స్, డబ్బు, అమ్మాయిలు, జల్సాలు,… వీటి చుట్టూనే కథ తిరుకుతుంది. ఏది ఎక్కువైనా ప్రమాదమే అని బాగా చెప్పాడు. అతిగా ఆశపడితే ఏం జరుగుతుందో చూపించాడు. మెట్రో సిటీస్ లో యూత్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. తాను అనుకున్న పాయింట్ ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని మెప్పించేలా తీసి సక్సెస్ సాధించాడు. ఎక్కడా ప్రేక్షకులు నిరాశ చెందకుండా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ సీన్లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాను తెరమీద చూపించాడు. అందుకే ఇది యూత్ కి బాగా నచ్చుతుంది.

ఇక నటీనటుల గురించి చెప్పాల్సి వస్తే…ఇందులో హీరోగా కిరణ్ నటించాడు. చాలా సహజంగా చేశాడు. భావోద్వేగాల్ని బాగా చూపించాడు. పెద్దగా హీరోయిజం లేకుండా మన పక్కనే స్టోరీ నడుస్తుందా అన్నట్టుగా పెర్ పార్మ్ చేశాడు. తనకు తానే మథన పడే పాత్రలో ఒదిగి పోయాడు. దర్శకుడు కిరణ్ నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. కిరణ్ కు ఈ సినిమా మంచి ప్రొఫైల్ గా ఉపయోగపడుతుంది. ఇక కిరణ్ గర్ల్ ఫ్రెండ్ గా హర్షద కులకర్ణి నటించింది. ఫస్ట్ సీన్ నుంచే హాట్ షేడ్ లో ఉన్న క్యారెక్టర్ అని చూపించారు. ఈ హాట్ హీరోయిన్ గా ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అందుకే సీన్స్ అంత బాగా వచ్చాయి. ఆ తర్వాత తాను హీరో కోసం పడే తపనను బాగా చూపించింది. ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయి. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గాయత్రి గుప్తా గురించి. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్లో నటించింది. పేరుకే ప్రాస్టిట్యూట్ కానీ ఎక్కగా వల్గారిటీ ఉండదు. కానీ డైలాగ్స్ కాస్త బోల్డ్ గా ఉంటాయి. ఆ డైలాగ్స్ ని సైతం బాగా చెప్పింది. ఈ సినిమాకు గాయత్రి చాలా ప్లస్ అయ్యింది. గాయత్రి ఎంటర్ అయినప్పటి నుంచి కథ ఊపందుకుంటుంది. గాయత్రి ఉన్న ప్రతీ సీన్ ఇంట్రస్టింగ్ గా మలిచాడు దర్శకుడు. సినిమాలో వచ్చే అనేక ట్విస్టులకు గాయత్రి కారణమౌతుంది. దీంతో కథకు చాలా కీలకమైంది. ఇక విలన్ కూడా చాలా బాగా చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తనకు మంచి పేరొస్తుంది. మహేష్ కత్తి కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మెప్పించాడు.

చివరగా… రొమాంటిక్.. ఎమోషనల్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో సందేహం లేదు. So… Go and watch It!

Rating: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here