కియా మోటార్స్ ప్రేమ్ ఇన్ స్థలేషన్ విభాగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

34

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్రేమ్
ఇన్ స్థలేషన్ విభాగాన్ని  సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కియా మోటార్స్  కోసం త్వరితగతిన హాంద్రీనీవా ద్వారా నీటిని సరఫరా చేస్తాం. ప్రపంచంలో నే వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతిపెద్ద దేశం. ప్రపంచంలో ని అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నా. అనంతపురం కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెన్నై – కృష్ణ పట్నం కారిడార్ అందుబాటులో ఉంది. APIICC అధికారులు, కలెక్టర్లు, మంత్రులు విస్తృతంగా పర్యటించారు. కియా ప్రతినిధులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు పని చేస్తున్నారు. ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నా. వ్యాపార అనుకూల ప్రాంతాల్లో ఏపీ ముందుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొస్తున్నారు. ఆటో మొబైల్ హబ్ గా ఏపీ ను తీర్చిదిద్దుతున్నాం. మూడున్నరేళ్ల వ్యవధిలో 1946 MOU లు కుదుర్చుకున్నాం. 32 లక్షల మందికి ఉపాధి లభించనుంది. విశాఖ లో మూడో సారి భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నాం. రైతులు చూపిన చొరవతోనే కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు వచ్చింది. ఆనాడు రాజధాని నిర్మాణానికి భూములు, ఈనాడు అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ కు రైతులు భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయుతనిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here