రివ్యూ : ‘జవాన్’

419


నటీనటులు: సాయిధరమ్ తేజ్-మెహ్రీన్-ప్రసన్న-కోట శ్రీనివాసరావు-జయప్రకాష్-సుబ్బరాజు-ఈశ్వరీరావు-నాగబాబు-సత్యం రాజేష్-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
నిర్మాత: కృష్ణ
రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ కు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మంచి బ్రేక్ ఇచ్చింది. తాజాగా ‘జవాన్’ గా మన ముందుకొచ్చాడు. దీనికి రైటర్ బి.వి.ఎస్.రవి అలియాస్ మచ్చ రవి దర్శకుడు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా మారిన ఆయనకు ‘జవాన్’ ఏమాత్రం కెరీర్ కు ప్లస్ అవుతుందో చూద్దాం పదండి.

కథ: జై(సాయిధరమ్ తేజ్) డి.ఆర్.డి.ఒ.లో ఎలాగైనా సైంటిస్ట్ కావాలనుకుంటుంటాడు. అందుకోసం అనేక ప్రవేశ పరీక్షలు కూడా రాస్తాడు. అయితే ఓ సారి మాత్రం ఆల్ మోస్ట్ సెలెక్ట్ అయినట్టే అయ్యి.. ఉద్యోగం మాత్రం పొందలేడు. అయినా కూడా నిరాశ చెందడు. అయితే విలన్(ప్రసన్న) మాత్రం డి.ఆర్.డి.ఒ. శాస్త్రవేత్తలు లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఆక్టోపస్ అనే మిసైల్ ను సొంతం చేసుకుని దాంతో దేశంలో అలజడి సృష్టించాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జై… ఆక్టోపస్ వెపన్ విలన్లకు దక్కకుండా అడ్డు పడుతుంటాడు. మరి ఇలా ప్రతి సారి అడ్డుపడే జైకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? విలన్ కు.. జైకు ఉన్న సంబంధం ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

జవాన్ కథ.. కథనాలు కొత్తగా ఉన్నాయి. DRDO నేపథ్యంలో రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. ఇంతకు ముందు డిఫెన్స్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా… ఓ కొత్త మిస్సైల్ కోసం విలన్లు కన్ను వేయడం… దాన్ని చే జిక్కించుకొని విధ్వంసాన్ని సృష్టించి… భారత ఆర్థిక వ్యవస్థను అస్థిర పరచాలని విలన్లు వేసే ప్లాన్ కు ఓ పౌరుడు భారతీయునిగా వారి చర్యలను నిరిధించే జవాన్ పాత్రలో సాయిధరమ్ తేజ్ పాత్ర ను అద్భుతంగా పిక్చరైజేషన్ చేశారు దర్శకుడు.

ఫస్ట్ హాఫ్ లో.. DRDO లో సైన్ టిస్ట్ కావాలనే తపన ఉన్న యువకునిగా… సెకండ్ హాఫ్ లో తనకు తృటిలో సైన్ టిస్ట్ అయ్యే చాన్స్ తప్పినా.. ఆ సంస్థ తయారు చేసిన ఆక్టోపస్ మిస్సైల్ ఉగ్రవాదుల పాలు కాకుండా… రక్షించే జై పాత్రను మెగా అభిమానులు మెచ్చేలా తెరకెక్కించాడు బి.వి.ఎస్. రవి.

సాయిధరమ్ తేజ్ జై పాత్రలో మెప్పించాడు. గతంలో కంటే ఈ సినిమాలో అన్ని అంశాల్లోనూ మెరుగ్గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్… డైలాగ్ డెలివరీలో ఎంతో ఈజ్ కనబరిచారు. మెహ్రీన్ అందాలు…యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విలన్ పాత్ర పోషించిన ప్రసన్న బాగా ఆకట్టున్నాడు. ధృవలో అరవింద్ స్వామి పోషించిన విలనిజం పాత్రను గుర్తుకు తెస్తుంది. మిగతా పాత్రలు పోసించిన జయప్రకాష్, సత్యం రాజేష్…. బాగానే చేశారు.

BVS రవి తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నారు. రచయితగా… దర్శకుడిగా ఈ సినిమాతో గుర్తింపు నపొందాడు. థమన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here