రివ్యూ: జంధ్యాల రాసిన ప్రేమకథ… బాగుందిలే!

46


రేటింగ్: 3
ఈ మధ్య వారం వారం.. అరడజనుకుపైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. మంచి కంటెంట్ వుండి… ఆడియన్స్ ని మెప్పిస్తే.. చాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతున్నాయి. అందులో ఈ వారం విడుదలైన సినిమాల్లో ముందు వరుసలో వుంటుంది ‘జంధ్యాల రాసిన ప్రేమ కథ’ నలుగురు యువతీ యువకుల మధ్య సంబంధ బాంధవ్యాలను హైలైట్ చేస్తూ.. ఈ కాలం సంప్రదాయాలకు అనుగుణంగా తెరకెక్కిన్న చిత్రం ఇది. ఈ రోజే విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: వంశీ(శేఖర్), రామ్(రోహిత్), పల్లవి(శ్రీలక్ష్మీ), చైత్ర(గాయత్రి గుప్త) అందరూ తమ తమ ఉద్యాగాలు బాధ్యతలతో విదేశాల్లో నిర్వహిస్తూ వుంటారు. అయితే రామ్.. పల్లవి ఓకానొక సమయంలో సన్నిహితం అవుతారు. ఫలితంగా వీరు ఓ అమ్మాయికి తల్లిదండ్రులవుతారు. అయితే ఉన్న పళాన రామ్… తన యజయాని అయిన చైత్ర(గాయత్రి గుప్త) ఆదేశాల మేరకు ఆమెతో పాటు బిజినెస్ దృష్ట్యా వేరే దేశానికి చైత్రతో పాటు కలిసి వెళతాడు. అప్పటికే రామ్ పై ఎంతో ప్రేమను పెంచుకున్న చైత్ర తను అనుకున్నది అక్కడ సాధించాలనుకుంటుంది. ఇంతలో పల్లవి తండ్రి తన కూతరురును చూడాలని మలేషియా వస్తాడు. అయితే అక్కడ రామ్ ప్లేస్ లో…. వంశీ(శేఖర్)ని రామ్ గా తన తండ్రికి పరిచయం చేస్తుంది పల్లవి. మరి ఇలా కన్ ఫ్యూజన్ తో మొదలైన వీరి నలుగురు కథ.. ఎలాంటి మలుపులు తీసుకుని సుఖాంతం అయిందనేదే మిగతా స్టోరీ. పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇలాంటి స్టోరీలో చాలా అరదుగా వస్తుంటాయి. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఇ.వి.వి.లాంటి వారు ఇలాంటి కథలను ప్రోత్సహించి కొత్త ట్రెండ్ ను సృష్టించారు. అలాంటి స్టోరీలను కంటిన్యూ చేయడానికి దర్శకుడు కృష్ణ వర్మ … ఈ కథను తెరకెక్కించాడనిపిస్తుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య మరో వ్యక్తిని ప్రవేశించేలా చేసి… ఆ తరువాత కథను సుఖాంతం చేయడానికి కొంత ట్విస్టును జోడించి ముగించడం బాగుంది. ఇలాంటి స్టోరీలు ఆడియన్స్ ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే వుంటాయి. కాకపోతే… ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను తెరమీద చూపగలిగితే చాలు… ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు. తాజాగా విడుదలైన ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ కూడా అలాంటిదే. బరువు బాధ్యతలతో కూడిన యువత…ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలని చాటి చెప్పే సినిమా ఇది.
తనకు బిడ్డ పుట్టబోతున్నది అని తెలిసి కూడా తన భాస్ ఆదేశాలకు మేరకు తన భార్య… పుట్టబోయే బిడ్డ బరువు బాధ్యతలను మరో వ్యక్తికి అప్పటిజెప్పి పోడవడం… దాని వల్ల ఎదురయ్యే సమస్యలను ఎంతో చాక చక్యంగా ఎదుర్కోవడం వంటి సన్నివేషాలు మనకు ఎదురు అవడం కాస్త వింతగా వున్నా…. ఇలా జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదురువుతాయనేది చక్కగా చూపించారు కృష్ణ వర్మ. ఫస్ట్ హాఫ్ లో లీడ్ రోల్స్ మధ్య కొంత సరదా పార్టును తెరకెక్కించి… ఆ తరువాత సెకెండాఫ్ లో బరువు బాధ్యతలను తెలియజేయడానికి రాసుకున్న కథ.. కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ముగింపు కూడా జంధ్యాల కథలానే వుండటంతో మరింత సహజంగా వుంటుంది. ఓ బిడ్డకు తల్లి అయిన ఆమెకు వంశీ(శేఖర్) తండ్రి కావడానికి ఒప్పుకోవడం కూడా కొంత మెచ్యురిటీని తెలియజేస్తుంది.
ఇందులో నటించిన శేఖర్… శ్రీలక్ష్మికి సపోర్టివ్ గా వుండటానికి పోషించిన పాత్ర చాలా మంది యూత్ ని ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. ఈ తరం యూత్ కి ఆదర్శంగా నిలుస్తుంది కూడా. అలానే పల్లవి అనే పాత్ర పోషించిన శ్రీలక్ష్మి కూడా తన బాధ్యతేంటో తెలిసిన తరువాత… తను కట్టుకున్న భర్తనే త్యజించడం మరో విశేషం. అంతే కాదు.. తాను… తనకు అండగా నిలిచిన వంశీ(శేఖర్)ను భర్తగా స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడకుండా స్టెప్ వేయడం కూడా అభినందనీయం. బ్యాచ్ లర్ గా వున్న వంశీ కూడా అందుకు అంగీకరించి… ఓ అమ్మాయికి తోడుగా నిలవడం ఆదర్శంగా వుంటుంది. ఎలాగైనా తనకు నచ్చిన వ్యక్తిని సొంతం చేసుకోవాలనే పాత్రలో గాయత్రి గుప్త చక్కగా ఒదిగిపోయారు. ఈ వారం విడుదలైన సినిమాలలో ఇది యూత్ కి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.
దర్శకుడు కృష్ణ వర్మ రాసుకున్న కథ.. కథనం బాగుంది. మరింత వేగం పెంచి సినిమాను పరుగెత్తించి వుంటే బాగుండేది. సంగీతం బాగుంది. పాటలతో పాటు… నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిడివి చాలా క్రిస్ప్ గా వుంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమాటోగ్రపీ రిచ్ గా వుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేమికులను ఆకర్షిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here