పవన్ కల్యాణ్ ప్రసంగం – పదకొండు ముఖ్యాంశాలు

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న కార్మికులకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. బుధవారం విశాఖ చేరుకున్న పవన్.. ఆత్మహత్య చేసుకున్న ఆ సంస్థ కార్మికుడు వెంకటేష్ కుటుంబాన్ని వారి ఇంట్లో పరామర్శించారు.

అనంతరం కార్మికుల ధర్నా వేదిక వద్దకు వెళ్లి వారికి మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయాలు, రాజకీయ పార్టీల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడారు. పవన్ ప్రసంగంలోని 11 ముఖ్యాంశాలివీ…

1. మీకు ఓట్లు కావాలి. కానీ సమస్యలు అడిగితే హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం అంటున్నారు. మేం ఏం చేయలేం అంటున్నారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లలేని మీకు 2019లో ఓట్లు అడిగే హక్కు లేదు. కడుపుమండి మాట్లాడుతున్నాను. దాదాపు నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టాం. ఏదో అద్భుతం జరుగుద్ది అని. ఈ రోజుకీ విభజన సమస్యలు అలాగే ఉన్నాయి.

2. నేను బీజేపీ పక్షం కాదు. టీడీపీ పక్షం కాదు. నేను ఏ పార్టీ పక్షం కాదు. నేను ప్రజా పక్షం. తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం. భారతదేశ ప్రజల పక్షం కానీ. భారతీయ జనతా పార్టీ పక్షం నేను కాదు. దేశానికి చాలా బలమైన నాయకులు కావాలి. ఈ దేశ సమస్యలు పరిష్కరించాలంటే ఒక పార్టీ సరిపోదు. ఒక నాయకుడు సరిపోడు. అనేక పార్టీలు కావాలి. అనేకమంది నాయకులు కావాలి.

3. నేను సమస్యల గురించి మాట్లాడితే నాకూ ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. ఏం పీకుతారు ఎవరైనా సరే? ఏం చేస్తారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకితే పీకండి. నేను కూడా ఏం చేయగలనో నేను కూడా చేసి చూపిస్తాను. నాకు భయాల్లేవు. ధైర్యమే ఉంది. ఒక ప్రాణం. పోతే మీ (ప్రజల) కోసం పోగొట్టుకుంటాను కానీ ఎవరెవరి కోసమో నేను పోగొట్టుకోను. మీకోసం అవసరమైతే జైలు కెళతాను. దెబ్బలు తింటాను.

4. నువ్వు ఏ పార్టీతో కలిసి పనిచేస్తావ్ అని అడుగుతారు. నా మనసులో ప్రజలు తప్ప పార్టీలుండవ్. ప్రజా పార్టీ. కులాలుండవ్. మతాలుండవ్. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకీ నేను మద్దతివ్వను. చంద్రబాబు కానీ నరేంద్రమోదీ కానీ వీరెవరూ నాకు బంధువులు అన్నదమ్ములు ఎవరూ కాదు. సొంత కుటుంబాన్ని వదిలివచ్చిన వాడ్ని రాజకీయాల్లోకి. నాకు ఒకటే కుటుంబం ప్రజా కుటుంబం. అది మీరే.

5. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిని కలిసినా కానీ ఈ రోజుకీ నాకొక ఫేవర్ చేయండని నేనెవరినీ అడగలేదు. కారణం నా నైతిక బలం కోల్పోకూడదని. నా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఒక సర్టిఫికెట్ అవసరమైతే ఏ ఒక్క కేంద్ర మంత్రినీ అడగలేదు. సమస్యలు నేను భరిస్తాను కానీ సమస్యల నుంచి పారిపోను.

6. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డినీ ఇదే అడుగుతున్నా. మీరు కూడా ఈ ఉద్యోగులకు అండగా నిలబడండి. ఇది అన్ని పార్టీల సమష్టి బాధ్యత. మీరు తిరగండి.. ఓట్లు సంపాదించుకోండి.. మీరు ముఖ్యమంత్రి కండి నాకేం సంబంధం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా.. నిర్మాణాత్మక రాజకీయాలు చేయడానికి పవన్ కల్యాణ్ మీకు అండగా నిలుస్తాడు. మీతో పాటు ప్రయత్నిస్తాడు.

7. టీడీపీ కానీ, వైఎస్సార్ సీపీని కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, లోక్‌సత్తా పార్టీ నాయకులు కానీ.. పదవి కోసమే పార్టీలు కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం కోసం పార్టీలు. నేను ముఖ్యమంత్రిని అయితేనే ఇది చేస్తాను అనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాను. అందరు సమష్టిగా కూర్చుని సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాలనే నేను మనస్ఫూర్తిగా ముందుకు వచ్చాను.

8. మీరు (అభిమానులు) సీఎం.. సీఎం.. అంటే నాకు లోపలేమీ అనిపించదు. మీకు సరదా ఏమో కానీ నాకు బాధ్యత. అందరు చేసే తప్పు మీరు చేయకండి. అధికారానికి జ్ఞానం కావాలి. అనుభవం కావాలి. ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా, సీఎం కావాలన్నా అనుభవం కావాలి. ఎబిలిటీలు చాలా అవసరం. పదేళ్లు రాజకీయాల్లో ఉండి అనుభవంతో చెప్తున్నా.

9. లాల్‌బహదూర్‌శాస్త్రి.. రైలు ప్రమాదం జరిగితే ఇది నా తప్పు అని రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలాంటి గొప్ప నాయకులు నడిపించిన దేశమిది. ఇప్పుడు ఎన్ని తప్పులు జరిగినా, ఏం జరిగినా ఒళ్లు మందమెక్కేసింది. ఏనుగు చర్మమైపోయింది. కానీ ఏనుగులకు కూడా అంకుశం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మీరంతా అంకుశం కావాలి. ప్రజలు అంకుశమై ప్రజా ప్రతినిధులకు మాడుపై గుచ్చుతుంటే వాళ్లు పనిచేస్తారు.

10. నిరాహార దీక్షలు చేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఇది ప్రభుత్వాల వైఫల్యం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మొచ్చు. దానికెవరూ కాదనరు. కానీ లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మే ప్రయత్నం, ధారాదత్తం చేసే ప్రయత్నం నాకు చాలా బాధ కలిగించింది.

11. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్మికులకు మద్దతుగా మొదటిసారి ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నా. ఈ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రతి ఒక్కరూ పరిష్కరించేందు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *