లోకేష్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

199

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్‌ అన్నారు. దొడ్డిదారిన లోకేశ్‌ను మంత్రిని చేశారని, ఆయనను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్‌ హెచ్చరించారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమని, తనతో లోకేశ్‌ బహిరంగ చర్చకు రావాలని పవన్‌ పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here