ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు ఆంగ్ల మాధ్యమం –  పార్ట్ 1

298
96 శాతం తల్లిదండ్రుల నుంచి ఆమోదం ఎలా పొందారంటే
……………..
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది.. లక్షల మంది చనిపోయారు.. ప్రపంచం స్తంభించిపోయింది.. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మనం అందుకు మినహాయింపేమీ కాదు. ప్రపంచమంతా లాక్‌డౌన్‌తో స్తంభించిపోయినా ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైసీపీ అక్కడి మాతృభాషను ఖూనీ చేసే ప్రయత్నాలకు మాత్రం లాక్‌డౌన్ వర్తించలేదు.
లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడినా తాను సృష్టించుకున్న వలంటీర్ల వ్యవస్థను ముందు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమానికి తెరలేపింది.. కార్యక్రమం అంటే ఇదేదో ప్రజాప్రయోజనకార్యక్రమం కాదు.. బలవంతపు బాప్టిస్మ్ లాంటిది. అవును… పాఠశాల విద్యార్థులున్న ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్ల చేతిలో ఒక ఫారం పెట్టి దానిపై ఆంగ్ల మాధ్యమం కావాలన్న చోట టిక్ పెట్టి సంతకమో, వేలిముద్రో వేయించుకుని వచ్చే పని.
ఆంగ్లమాధ్యమ అభిప్రాయ సేకరణకు మూడు పద్ధతులు
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా అభిప్రాయ సేకరణ చేయడానికి ప్రధానంగా మూడు పద్ధతులు అనుసరించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
* నోరు విప్పి నాలుగు ఇంగ్లిష్ మాటలు ఆడడం రాకపోయినా వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులతో వారివారి ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేయడం.
* వలంటీర్లను పంపించి సంతకాలు పెట్టించడం.. కాదుకూడదంటే ‘అమ్మఒడి’ ప్రస్తావన తెచ్చి మొహమాట పెట్టడం.. అప్పటికీ వినకపోతే అమ్మఒడి పథకం వర్తించదని బెదిరించి సంతకాలు తీసుకోవడం.
* అసలు విద్యార్థుల తల్లిదండ్రుల వరకు వెళ్లకుండా వలంటీర్లే ఫారాలపై సంతకాలు, వేలిముద్రలు వేయడం.
ఇలా.. మాకు ఆంగ్లమాధ్యమమే కావాలని 96 శాతానికపైగా తల్లిదండ్రులు ఆమోదం పలికారంటూ ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేసింది.
(ఇంతకీ ఏపీలో ఇలా ఆంగ్ల మాధ్యమం కోసం అభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టారు..? ప్రభుత్వం బలవంతంగా ఆంగ్లమాధ్యమం రుద్దాలనుకుంటే అడ్డుకుని తెలుగు భాషను బతికించే ప్రయత్నం చేస్తున్నదెవరు? వంటి వివరాలన్నీ పార్ట్-2లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here