రివ్యూ: భయపెట్టని రొటీన్ దెయ్యం

74
intlo-deyyam-nakem-bhayam
నటీనటులు: అల్లరి నరేష్, కృతిక, మౌర్యాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, జయప్రకాష్ రెడ్డి, ప్రగతి, బాహుబలి ప్రభాకర్, చలపతిరావు తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం:దాశరథి శివేంద్ర
మాటలుః డైమండ్ రత్నబాబు
నిర్మాతః బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ – స్క్రీన్ ప్లే-దర్శకత్వంః నాగేశ్వరరెడ్డి
రేటింగ్: 1.5
చాలా కాలంగా ఓ హిట్టుకోసం చూస్తున్నాడు అల్లరి నరేష్. కానీ ఏ దర్శకుడూ అతనికి ఓ మంచి హిట్టు ఇవ్వడానికి ట్రై చేయడం లేదు. అతనితో రొటీన్ కామెడీ చేయిస్తూ… అతని కెరీర్ నే ప్రమాదంలో పడేశారు. రొటీన్ కథలను ఎంచుకుంటూ.. తన కెరీర్ నే ఫణంగా పెట్టేస్తూ నెట్టుకొస్తున్నాడు నరేష్. ఇటీవల వరసు ఫ్లాపులు వస్తున్నా కూడా నరేష్ జాగ్రత్తలు పాటించడం లేదనేదానికి ఉదాహరణ శుక్రవారం విడుదలైన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులన్ని ఏమాత్రం భయపెట్టిందంటే… అది ప్రేక్షకులే చెప్పాలి.
కథ ఏంటంటే… బ్యాండు మేళం బ్యాచ్ నరేష్(నరేష్)కి స్వప్న(మౌర్యానీ) అనే మరదలు వుంటుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. పెద్దలు కూడా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు. తీరా రిజిష్టర్ మ్యారేజ్ సమయంలో స్వప్న తన కొలీగ్ అయిన వేరే వైద్యుణ్ని పెళ్లి చేసుకుందని నరేష్ కు తెలుస్తుంది. అయితే నరేష్ మాత్రం ఫీలవ్వకుండా.. తన లాంటి బ్యాండు మేళం గాణ్ని పెళ్లి చేసుకోవడం కంటే.. వైద్య విద్యను చదివిన తన మరదలు ఓ వైద్యుణ్నే పెళ్లి చేసుకోవడం మంచిదేలే అని సరిపెట్టుకుంటాడు. కట్ చేస్తే.. బ్యాండు మేళం నరేష్ ఓ అనాధ చిన్నారికి వైద్యం చేయించడం కోసం రౌడీల వద్ద అప్పు చేస్తాడు. దాన్ని తీర్చడం కోసం.. ఓ భవంతిలో వున్న దెయ్యాన్ని పారదోలడానికి రాజేంద్రప్రసాద్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దెయ్యాన్ని వెళ్లగొట్టడం కోసం వెళ్లిన నరేష్.. ఆ దెయ్యం చేతిలోనే బంధీ అవుతాడు. ఇక అక్కడి నుంచి భయటపడలేక నరేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అసలు ఆ దెయ్యం ఎవరు? ఎందుకు నరేష్ ను పట్టుకుని పీడిస్తుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ..కథనం విశ్లేషణ: అనగనగా ఓ పెద్ద భవంతి. ఆ భవంతిని ఓ పెద్దాయన కొనుగోలు చేస్తాడు. అయితే అందులో ఓ దెయ్యం వుటుంది. అది అందరినీ భయపెట్టిస్తుంటుంది. దాన్ని భవంతి నుంచి పారద్రోలడానికి ఓ భూత వైద్యుడు కావాలి. ఇలాంటి స్టోరీలు ఇప్పటికే చాలా చూశాం. కానీ నరేష్ ఇలాంటి రొటీన్ స్టోరీనే ఎంచుకున్నాడు. ఇంతకు ముందు ఇలాంటి జోనర్లో తనకు ఒక్క సినిమా కూడా లేదని భావించి.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుని వుండొచ్చేమోగానీ.. ఇప్పటికైతే.. ఇది చాలా లేట్ జోనర్. ఈపాటికే చాలా మంది ఈ జోనర్లో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. దాంతో ఈ సినిమా రొటీన్ అనిపిస్తుంది.
అయితే.. ఇందులో దెయ్యంగా మారిన హీరో మరదలు.. తన బావ మీద ప్రేమచావక.. తిరిగి పెళ్లి చేసుకోవాలి.. అతనితోనే వుండాలనే కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ… దాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం పరమ రొటీన్ గా వుంది. ఎక్కడా కథను ముందుకు నడిపించే ఇంట్రెస్టింగ్ కథనం వుండదు. ముందుగానే ఊహించే అనేక చెత్త సీన్లు ఇందులో మనకు కనిపిస్తాయి. హారర్ సినిమా అంటే కనీసం ఏదో ఓ సీన్లో నైనా భయపడాలి. కానీ ఇందులో ఎక్కడా భయపెట్టే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు.
అల్లరి నరేష్.. నట కిరీటి రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందం.. జయప్రకాశ్ రెడ్డి లాంటి స్టార్ కమెడియన్లంతా వున్నా కూడా ఈ సినిమాను ముందుకు నడిపించడానికి ఎవ్వరూ ఉపయోగపడలేదు. అయితే.. ఇందులో వీరి తప్పేం లేదు. కథ..కథనం రాసుకున్న దర్శకుడిదే అంతా . ఇలాంటి గొప్ప హాస్యనటులతో రెండు గంటల పాటు హాయిగా నవ్వించే అనేక సీన్లను రాసుకుని వుంటే.. ఇది నరేష్ కెరీర్లో మంచి సినిమా అయ్యే ఛాన్స్ వుండేది. కానీ దర్శకుడు అలా నిలబెట్టడానికి  ఏకోశాన ట్రై చేయలేదు. దాంతో ఇదో రొటీన్ దెయ్యం సినిమాలానే మిగిలిపోయింది. మొదటి హాఫ్ అక్కడక్కడా నవ్వించినా.. సెకెండాఫ్ మొత్తం తేలిపోయింది. ఇంత సీరియస్ సినిమాలో నాలుగు పాటలను జొప్పించడం అంటే.. సినిమాను ముందుకు నడిపించే విషయం లేకనే అని అర్థమైపోతుంది. ఇందులో నటించిన వారంతా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. కానీ.. కథ..కథనం వీక్ కావడంతో సినిమా ఓ సాధారణ దెయ్యం సినిమాలా మిగిలిపోయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగా వుంటే బాగుండు. పెద్ద సినిమాలను తీసిన నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. ఓ లో బడ్జెట్టు సినిమాను ఈ జోనర్లో చేయడానికి ముందుకు రావడం మంచిదే. కానీ ఇలాంటి జోనర్ ను ఎంచుకోవడమే చాలా లేట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here