70 వసంతాల.. మువ్వన్నెల జెండా!

భారత జాతీయ జెండాను ఆమోదించి జులై 22వ తేదీకి 70 ఏళ్లు అవుతోంది. 1947, జులై 22న నిర్వహించిన రాజ్యంగ సభలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు.. మధ్యలో అకోక చక్రంతో రూపొందించిన జెండాను భారత జాతీయ జెండాగా ఆమోదించారు. జాతీయ జెండాను రూపొంచిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మన గర్వకారణం. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రుకు చెందిన వెంకయ్య 1916 నుంచే జాతీయ జెండాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేశారు. భారత దేశ కార్యాలయాలపై బ్రిటీష్‌ ప్రభుత్వ జెండాలు ఎగురవేయడంపై ఆయన ఎంతో కలత చెందేవారు. మన దేశానికి ప్రత్యేకంగా జాతీయ జెండా ఉండాలని అనుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న జాతిపిత మహాత్మా గాంధీ.. పతాక రూపకల్పన బాధ్యత ఆయనకే అప్పిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *