తొలి దశలో ‘100’ క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం

253

రాష్ట్రవ్యాప్తంగా ఆకలితో అలమటించే నిరుపేదలకు పట్టెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను బుధవారం విజయవాడలోని ఏ కన్వన్షన్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించరు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 50వేల జనాభా పైబడిన అన్ని పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా తొలిదశగా ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 203 క్యాంటీన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ. 200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క క్యాంటిన్‌ ఏర్పాటుకు రూ.36లక్షలను మంజూరు చేసింది. అంతే కాకుండా ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాల కొరత ఉండటంతో అన్నింటినీ ప్రారంభించడం సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న 100 ప్రాంతాల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో ఇప్పటికే రెండు క్యాంటీన్లను పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వంగా తాజాగా ఏర్పాటు చేయనున్న ఈ 100 క్యాం టీన్లు వారంలో ఆరు రోజులపాటు నిరుపేదలకు నిర్విఘ్నంగా ఆహారాన్ని అందించే చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం మాత్రం వీటికి సెలవుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి మొత్తం రూ.15లు ఒక్కరి నుంచి వసూలు చేస్తారు. అంటే పూటకు రూ.5లు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ ఒక్కొక్క క్యాంటీన్లలో రోజుకు 200 మందికి ఆహారాన్ని సమకూర్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అంటే ఉదయం 300 మందికి టిఫిన్‌, మధ్యాహ ్న భోజనం 360 మందికి, రాత్రి భోజనం 240 మందికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్యాంటిన్ల ప్రారంభం అనంతరం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి వీటిని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

మెను ఇదే..

వారంలో 6 రోజులపాటు పనిచేసే

అన్న క్యాంటీన్లలో అందించే

ఆహార వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సోమవారం అల్పాహారంగా ఇడ్లీ లేదా పూరి,

మంగళవారం ఇడ్లీ, ఉప్మా,

బుధవారం ఇడ్లీ, పొంగలి,

గురువారం ఇడ్లీ, పూరి,

శుక్రవారం ఇడ్లీ, ఉప్మా,

శనివారం ఇడ్లీ, పొంగలి

అందించేందుకు అధికార

యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ప్లేటుకు మూడు ఇడ్లీ లేదా

మూడు పూరి, అదేవిదంగా

ఉప్మా, పొం గలి 200 గ్రాములు ఇస్తారు.

మధ్యాహ్నం, రాత్రి భోజనంలో

అన్నంతోపాటు ఒక కూర, పప్పు,

సాంబారు, పెరుగు, పచ్చడి

అందించనున్నారు.

మధ్మాహ్నం, రాత్రి భోజనంలో

అన్నం 400 గ్రాములు, కూర 100

గ్రాములు, సాంబారు 120

గ్రాములు, పెరుగు 75 గ్రాములు

అందించనున్నట్లు అధికార

యంత్రాంగం పేర్కొంది. ఈ

క్యాంటీన్లు ఉదయం 7.30

గంటల నుంచి 10 గంటల వరకు

టిఫిన్‌, మధ్యాహ్నం 12.30

గంటల నుంచి 3 గంటల వరకు,

అందే విధంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here