నాన్ స్టాప్ కామెడీతో అలరించే ‘హైదరాబాద్ నవాబ్స్2’

178

హైదరాబాద్ మహానగర భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో వుంచుకుని… ఇక్కడి కల్చర్ ఉట్టిపడేలా గతంలో ‘హైదరాబాద్ నవాబ్’ పేరుతో రిలీజ్ అయ్యి… సినీ విమర్శకుల చేత సైతం ప్రశంసలందుకొంది. ఈ చిత్రం నగరంలోని ఓ థియేటర్లో శత దినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. తక్కువ బడ్జెట్టులో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వుట్టిపడేలా తెరకెక్కిన ఈ చిత్రం.. నిర్మాతలకు బాగానే లాభాలను ఆర్జించి పెట్టింది. తాజాగా నేడు ‘హైదరాబాద్ నవాబ్2’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం మరి ఎలా వుంటుందో చూద్దాం పదండి.

కథ: హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే… తమకంటూ ఓ ఇల్లు వండాలనే తలంపుతో ఓ ఐదు కుటుంబాలు మున్న, రేష్మ(ఆలీ రాజా, ఫరాఖాన్)తో సహా… మరో నాలుగు కుటుంబాలు కలిసి… నగరంలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు అయిన షాజిద్-వాజిద్(గుల్లు దాదా-హుస్సేన్ బకిలీ)లు కలిసి అక్రమ లేవుట్లో నిర్మించబడిన ఐదు ఫ్లోర్ల ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే అది నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని తెలుసుకున్న ఈ ఐదు కుటుంబాలు… తమకు నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లను ఇవ్వాలని షాజిద్-వాజిద్ లపై తిరగబడతారు. మరి ఇలా తిరగబడిన వీరికి లీగల్ గా వున్న ఫ్లాట్లను సాజిద్-వాజిద్ నిర్మించి ఇచ్చారా? అందుకోసం వారు ఏం చేశారు? వారికి ఎవరు సహాయం చేశారు? తదితర వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం విశ్లేషణ: హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను ప్రధానంగా బేస్ చేసుకుని రాసుకున్న ‘హైదరబాద్ నవాబ్2’.. కథ.. కథనాలు ఓ వైపు ఎంటర్టైన్ చేస్తూనే… మరోవైపు రియల్ మోసాలకు బలికావొద్దు అనే మెసేజ్ ను కూడా ఇచ్చాడు డైరెక్టర్ ఆర్కే. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుకునేలా ఆర్.కె.దర్శకత్వం వహించారు. సాధారణంగా మన కుటుంబాల్లో చూసే సందర్భాల్నే మరింత ఫన్నీగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఇందులో చాలా మంది కొత్త ఆర్టిస్టులున్నప్పటికీ… సీనియర్ నటీనటుల్లా నటించారు. ప్రతీ సీన్ ను పండించేందుకు ట్రై చేశారు. గతంలో వచ్చిన హైదరాబాద్ నవాబ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా కామెడీ వర్కవుట్ చేయగలిగారు. హీరోలు, హీరోయిన్స్ అందరూ చాలా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ అందించిన పాటలు సినిమాకు బాగా హెల్పయ్యాయి. రీ రికార్డింగ్ కూడా బాగుంది. మంచి హాట్ హాట్ ఐటమ్ సాంగ్స్ మాస్ ని మెప్పిస్తాయి. హైదరాబాద్ లోకల్ కల్చర్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆలీ రజత్ హ్యాండ్ సమ్ గా కనిపించడమే కాదు తన పెర్ ఫార్మెన్స్ తో ఆక్టటుకున్నాడు. కామెడీ బాగా చేశాడు. హీరో అజీజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి తనదైన కామెడీతో నవ్వించాడు. పప్పూ పాత్రలో మెప్పించాడు. రియల్ ఎస్టేట్ మీడియేటర్ పాత్రలో హీరోయిన్ ని పడేసే పాత్రలో తన స్నేహితుడికి వచ్చిన సమస్యను తీర్చే క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. రఘు పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. తనదైన కామెడీతోఅలరించాడు. ఇక ఆర్.కె. మామ పాత్రలో కథకు కీలకమైన సీన్స్ లో కనిపించారు. హీరోయిన్ ఫరా ఖాన్ క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. సూఫీఖాన్, సమైరా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. విలన్ క్యారెక్టర్ తో పాటు చిన్న చిన్న పాత్రలు చేసిన వారు కూడా తమ పాత్రల్లో జీవించారు. టెక్నికల్ గా క్వాలిటీ సినిమా రూపొందించారు. సరదాగా నవ్వుకోవడానికి ఓ సారి ఈ ‘హైదరాబాద్ నవాబ్స్2’ను చూసేయొచ్చు. గో అండ్ వాచ్!

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here