స్నేహానికి.. ప్రేమకి మధ్య జరిగే ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’

62

‘అందాల రాక్షసి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్.. టైగర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి లవర్ బాయ్ గా నటించిన ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’తో మన ముందుకొచ్చాడు. అతని సరసన రేష్మీ మీనన్, జియా జంటగా నటించగా… రాజ్ సత్య దర్శకత్వం వహించాడు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ రోజే విడుదల చేశారు. మరి రాహుల్ రవింద్రన్ ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ ఎలా వుందో చూద్దాం పదండి.

 

స్టోరీ: కార్తీక్(రాహుల్ రవీంద్రన్) ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తుంటారు. అతనికి ఓ ఇన్ ఫ్రా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భాగ్యలక్షి(రేష్మీ మీనన్) పరిచయం అవుతుంది. వీరిద్దరూ తొలిచూపులోనే ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకుంటున్న సమయంలోనే కార్తీక్ కి అమ్మాయిల కంటే.. అబ్బాయిలంటేనే బాగా ఇష్టం అని తెలుస్తుంది. దాంతో అతన్ని అనుమానించడం మొదలుపెడుతుంది. దాంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అలా దూరమైన వీళ్లిద్దరూ మళ్లీ ఒకటి ఎలా అయ్యారు? అసలు కార్తీక్ పై భాగ్యలక్ష్మికి అలా అనుమానం ఎందుకు వచ్చింది? అసలు కార్తీక్ తల్లిదండ్రులు ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ విశ్లేషణ: తెలుగు సినిమాలో లవ్ స్టోరీలకు మంచి ఆధరణ వుంది. అయితే ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యూత్ కి నచ్చే అందాలతో… రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరించిన సన్నివేశాలను యూత్ ని బాగా ఆకట్టకుంటాయి. అలానే ఈకాలం యువతకు నచ్చేలా స్నేహానికి.. ప్రేమకి మంచి అర్ధం చెప్పే సినిమా ఇది. ఇక రకంగా చెప్పాలంటే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. రొటీన్ కి భిన్నంగా స్నేహానికి.. ప్రేమను మిళితం చేసి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. మొదటి హాఫ్ అంతా ప్రేమ.. కామెడీతో నింపేసి… ద్వితీయార్థంలో మాత్రం ప్రేమకి.. స్నేహానికి మధ్య జరిగే సంఘర్షణను తెరమీద బాగా చూపించారు. దాంతో యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు. ఈ వారం తప్పకుండా యూత్ కి నచ్చే సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ.
రాహుల్ రవీంద్రన్ మరోసారి లవర్ బాయ్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా జియాతో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యువతకు బాగా నచ్చుతాయి. ఆమెతో వున్న సాంగ్ కూడా బాగుంది. ఆమె అందాలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో రేష్మి మీనన్ లవ్ స్టోరీ బాగ క్యారీ చేశాడు దర్శకుడు. అలానే రాహుల్ రవీంద్రన్ ని అనుమానించే తీరును కూడా ఒల్గారిటీ లేకుండా చక్కగా చూపించారు. రేష్మి మీనన్ హాట్ గా లేకపోయినా.. హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. వైద్యుని పాత్ర లాంటి కీలక పాత్రలో రావు రమేష్ నటించి మరోసారి మెప్పించాడు. అతని పాత్ర ఇందులో చాలా కీలకం. అంబటి కామెడీ కొంత విసిగించినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మిగతా పాత్రలు పోషించిన షఫీ, రచ్చరవి, సన, సూర్య, రమాప్రభ పాత్రలు పర్వాలేదు అనిపిస్తాయి.
దర్శకుడు రాజ్ సత్య.. స్నేహానికి, ప్రేమకి మధ్య రాసుకున్న కథ.. కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో కథ.. కథనాలను వేగంగా నడిపి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుండాల్సింది. ఓ ఇరవై నిమిషాల పాటు కత్తెర వేయొచ్చు. అలానే సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా వున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. లొకేషన్స్ ఎంపిక బాగుంది.
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here