సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన బాలయ్య వీడియో

53

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఫేస్‌బుక్‌ వేదికగా ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. ఇందులో బాలయ్య ఓ హోటల్‌లో ఒంటరిగా కూర్చొని, ఆహారం తింటూ కనిపించారు.పెద్ద స్టార్‌ అయినప్పటికీ ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్‌గా హోటల్‌లో కూర్చొని ఉన్న బాలయ్యను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.కానీ ఈ వీడియో ఏ సందర్భంలో, ఎక్కడ తీశారో తెలియడం లేదు.బాలయ్య ప్రస్తుతం తన 102వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జై సింహా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు.హరిప్రియ, నటాషాదోషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.త్వరలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు.

‘జై సింహా’ తర్వాత బాలయ్య ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించనున్నారు.తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రానికి బాలయ్యే నిర్మాతగా వ్యవహరించనున్నారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్న ఈ సినిమాలో నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here