తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

67

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశా​ఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుముదురు వానలు, రాయలసీమలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణం కేంద్రం వివరించింది. దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అంతే కాకుండా ఈనెల 13 నాటికి ఉత్తర బంగాలాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here