హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు శుభవార్త

64

హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఆన్‌లైన్‌లో ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసింది. ఇకపై ఈ సేవలను ఉచితంగా అందించనుంది. నవంబర్‌ 1 నుంచి ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.

సవరించిన ఛార్జీల ప్రకారం సేవింగ్స్‌, శాలరీ ఖాతాలు కలిగిన ఖాతాదారులు ఇకపై రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిలిమెంట్‌ (ఆర్టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ) ద్వారా చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

అంతకుముందు ఆర్టీజీఎస్‌ ద్వారా రూ.2-5 లక్షల మధ్య చేసే లావాదేవీలకు రూ.25, రూ.5లక్షల పైబడి మొత్తంపై రూ.50 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు. అలాగే, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా రూ.10వేలు లోపు లావాదేవీలపై రూ.2.5, రూ.10వేలు నుంచి రూ.లక్ష మధ్య రూ.5, రూ.1-2 లక్షల మధ్య రూ. 15, రూ.2లక్షలకు పైబడి మొత్తాలపై రూ.25 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు. ఒకవేళ ఇవే తరహా లావాదేవీలను బ్యాంక్‌ శాఖలో జరిపితే మాత్రం రుసుము వసూలు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here