రివ్యూ: హ్యాపీ బర్త్ డే… సెలబ్రేషన్స్ ఓకే!

200

 

Chennamaneni Sridhar, Sanjana in Happy Birthday Telugu Movie Stills

నటీనటులు: చెన్నమనేని శ్రీధర్ రావు, సంజన, జ్యోతి సేధి, శ్రవణ్ తదితరులు
సంగీతం: సంతోష్ రెడ్డి
నిర్మాత: కె. మహేష్
దర్శకత్వం: పల్లెల వీరా రెడ్డి
రేటింగ్: 3/5
చెన్నమనేని శ్రీధర్ రావు సిటీలో టాప్ మోస్ట్ పెయిడ్ మేల్ మోడల్. గతంలో బంగారం, పులి సినిమాల్లో నెగిటివ్ రోల్ పోషించాడు. అంతకుముందు సుమంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సత్యం మూవీలోనూ నెగిటివ్ పాత్రను పోషించి మెప్పించాడు. చాలా కాలం తరువాత ఓ లీడ్ రోల్ పోషించాడు శ్రీధర్ రావు. అతనితో పాటు సంజన, జ్యోతి సేధి, శ్రావణ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రదారులుగా పల్లెల వీరా రెడ్డి తెరకేకించిన చిత్రమే ఈ చిత్రం పేరు ‘హ్యాపీ బర్త్ డే’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలావుందో చూద్దాం పదండి.
స్టోరీ: యాడ్ ఫిల్మ్ దర్శకుడైన రాహుల్ (శ్రీధర్ రావు), మోడల్ రియా (జ్యోతి సేధి) లు తమ పుట్టినరోజు వేడుకను గెస్ట్ హౌస్ లో సరదగా జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇంతలోపే ఆ ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాహుల్ ను తీవ్రంగా కొట్టి పడేస్తాడు. ఆ కాసేపటికే రియా పై కూడా ఎవరో దాడి చేస్తారు. అలా ఆ జంటపై దాడి చేసింది ఎవరు ? ఆ దాడికి కారణం ఏమిటి ? రాహుల్, రియాలు చేసిన తప్పేంటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేదే తెరపై నడిచే కథ.
స్టోరీ విశ్లేషణ: వెండితెరైనా.. బుల్లితెరైనా.. గ్లామర్ కి ఇంపార్టెంట్ వుంటుంది. అలానే యాడ్ ఫిలిమ్స్ కి కూడా. వీటిని డైరెక్ట్ చేసే దర్శకుల జీవితం ఎంత కలర్ ఫుల్ గా వుంటుందో మాటల్లో చెప్పలే. ఎందుకంటే వీటి నేపథ్యం అలాంటిది. వీటిపై బయట ఎంత ప్రచారం వుందో… తెరవెనక కూడా అంతకంటే ఎక్కువగానే వుంటుంది. ఇలాంటి జీవితం కోరుకునే వారికి ప్రేమ.. వివాహబంధాల మీద బలమైన నమ్మకం వుండదు. ఎందుకంటే రంగుల జీవితం కదా. ఈ కలర్ ఫుల్ లైఫ్ లో కూరుకుపోయి కొంత మంది ప్రాణాలనే పోగొట్టుకున్నారు? కొంతమంది నేరస్తులయ్యారు. అలాంటి కథను బేస్ చేసుకుని తెరకెక్కించిందే.. ‘హ్యాపీబర్త్ డే’. మొదటి భాగంలో శ్రీధర్… జ్యోతి సేథ్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్.. రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. అయితే అక్కడక్కడ హారర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత చిరాకు పుట్టించినా… అవేవీ ద్వితీయార్థంలో లేకుండా చూసుకున్నాడు దర్శకుడు. ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఇదేదో హారర్ మూవీనా అనేటట్లు కొన్ని హారర్ సీన్స్ ను చూపించి.. అవన్నీ ఏదో భ్రమ అనేలా తేల్చేశాడు దర్శకుడు. మొదటి భాగం మొత్తం రొమాన్స్ తో నడిపించేసి… ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఓ ఆసక్తికరమైన ట్విస్టుతో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా ఇంటర్వెల్ కార్డు వేశాడు దర్శకుడ. ఆ తరువాత వచ్చే సీన్స్ అన్నీ చాలా ఆసక్తిగా వుంటాయి. రాహుల్.. రియాలను చంపడానికి గల కారణాలను బలంగా రాసుకున్నాడు దర్శకుడు. వాటిని రివీల్ చేసిన విధానం బాగుంది. ప్రాణంగా ప్రేమించిన వారి చేతిలో మోసపోయిన ఇద్దరు ప్రేమికులు పడే బాధను వ్యక్తపరచడంలో శ్రావణ్ రాఘవేంద్ర, సంజన గల్రానిలు మంచి నటన కనబరిచారు. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా రిచ్ గా షూట్ చేశాడు. ఉన్నవి రెండు పాటలే అయినా యూత్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే.. కథ.. కథనాలను ఇంకాస్త బలంగా రాసుకుని వుంటే.. యూత్ ని బాగా ఆకట్టుకునేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా సింపుల్ గానే తెరకెక్కించాడు దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here