కేశినేని ట్రావెల్స్ మూసివేత

 

గత అర్ధరాత్రి నుంచి కేశినేని ట్రావెల్స్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో ఆ ట్రావెల్స్ కార్యాలయాన్ని మూతపడ్డాయి. ఈ మేరకు కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ యజమాని కేశినేని నాని ప్రకటించారు. దీంతో 170 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. గత వారం రోజుల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌ను నిలిపేశారు. కేశినేని ట్రావెల్స్ మూసివేతకు ప్రధాన కారణం.. ఏపీ రవాణాశాఖ కమిషనర్ సుబ్రమణ్యంతో గొడవ నేపథ్యంలోనే సంస్థ మూసివేతకు నాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆర్టీఏ అధికారులపై దాడి నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నాని.. ఆయన చేత రవాణా శాఖ కమినర్‌కు చంద్రబాబు క్షమాపణలు చెప్పించారు. ఈ విషయంలో కేశినేని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు స్వయంగా కేశినేని నాని ప్రకటించారు. ట్రావెల్స్‌ను మూసివేయొద్దని చంద్రబాబు కోరినా.. తాను మాత్రం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *