హైదరాబాద్‌పై మాకు హక్కు ఉంది..సీఎం

హైదరాబాద్‌పై తెలంగాణ సీఎంకి  ఎంత హక్కు ఉందో ఆంధ్రప్రదేశ్‌ సీఎంకి  కూడా అంతే హక్కు ఉందని  సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీ ఏసిబి మీకు ఉంటే మా ఏసిబి మాకు ఉంది, మీ పోలీసులు మీకు ఉంటే మా పోలీసులు మాకూ ఉన్నారని ఆయన ఆవేశంగా అన్నారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ తెలంగాణా సీఎం తనను ఏమీ చేయలేక కుట్రలు పన్నుతున్నారని ఆయన వివరించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల అధికారాలు గవర్నర్‌కే ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *