విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు

chandra-babu-naidu-in-office -jpgఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగువేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే ఉండి పరిపాలన సాగించడం, అవసరమైన సందర్భాల్లో విజయవాడ వచ్చివెళుతున్న చంద్రబాబు ఇక్కడే క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఈ ఉదయం ప్రారంభించారు. ఇక నుంచి వారానికి మూడు రోజులు చంద్రబాబు ఈ క్యాంపు కార్యాలయంలోనే ఉండనున్నారు. తప్పనిసరి పరిస్థితులు ఉంటే.. ఐదు రోజుల పాటు కూడా ఉంటారని సమాచారం. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపేందుకు వీలుగా ఈ కార్యాలయంలో సీఎం చాంబర్, సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యాలయాన్ని ఈనెల 6నే ప్రారంభించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *