మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన

20150610424769ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నది, కొండవీటి వాగు రిజర్వాయర్‌..వాటర్‌ఫ్రంట్‌ మధ్య బ్లూగ్రీన్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. రెండు ఐకాన్‌ టవర్లు, వాటర్‌ఫ్రంట్‌, సువిశాల రహదార్ల మధ్య చారిత్రక పర్యాటక కేంద్రంగా రాజధాని నిలవాలని ఆయన చెప్పారు. రాజధానిలో మూడు రీజియన్ కేంద్రాల మధ్య 9 థీమ్‌ సిటీల నిర్మాణముంటుందని బాబు తెలిపారు. నిర్మాణం పకడ్బందీగా పర్యావరణ హితంగా జరుగుతుందని ఆయన చెప్పారు. సవాళ్లు లేకపోతే అవకాశాలు ఉండవని, ఎక్కడ సవాళ్లు ఉంటాయో అక్కడే అవకాశాలు ఉద్భవిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *