భూసేకరణకు తాత్కాలిక బ్రేక్‌

Andhra-Pradesh-NEW-mapఆంధ్రప్రదేశ్‌ రాజధానికు భూసేకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. జీవో 166ను రెండు వారాల పాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుంచి 95 శాతం వరకు భూసమీకరణ చేపట్టింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ప్రకారం ఏపీ సర్కార్‌ భూసేకరణ కింద జీవో 166 జారీ చేసింది. దీంతో భూసేకరణను రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *