పుష్కరాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మకాం వేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఘాట్లలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. భక్తులతో అధికారులు, పోలీసులు, వలంటీర్లు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. విశాఖ-రాజమండ్రి మార్గంలో రద్దీ నియంత్రణకు బస్‌ బే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *