తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం

chandrababunaiduతూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయ విచారణకు ఆదేశించారు. దాదాపు 32 మంది మృతి చెందినట్లుగా సమాచారం. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు స్వయంగా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *