ఆన్‌లైన్‌లో 3వ రుణమాఫీ జాబితా

ap-log-apvarthalu-com2ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం మూడోవిడత రుణమాఫీ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచింది. 4.74 లక్షల మంది రైతులు రుణ అర్హత సాధించారు. రూ.890 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. రుణమాఫీ వల్ల 34.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సంబంధిత అధికారి కుటుంబరావు తెలిపారు. పది శాతం వడ్డీతో మొత్తం రూ.24 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని ఆయన తెలిపారు. త్వరలో మిగిలిన రుణమాఫీకి టెంపర్‌ప్రూఫ్‌ కూపన్ పేపర్‌తో బాండ్లు జారీ చేయనున్నట్లు కుటుంబరావు తెలిపారు. బాండ్ల రూపకల్పనపై ప్రభుత్వం న్యాయసలహా కోరింది. డెత్ కేసులు, నో డేటా అకౌంట్ల వారు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. www.apcbsportal.gov.ap.రుణమాఫీ జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *