వైసీపీ ప్రభుత్వ అకృత్యాలుకు ప్రజలే బుద్ది చెప్తారు : మాజీ మంత్రి పల్లె

84

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వారు చేస్తున్న అకృత్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టి బంగాళాఖాతంలోకి విసిరేస్తారన్న భయం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు ఉంది అని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటు అని పల్లె విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఆలోచన చరిత్రాత్మక నిర్ణయం అంటూ వైసీపీ మంత్రులు, శ్రేణులు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అని పల్లె విరుచుకుపడ్డారు.

మీ నిర్ణయం అధ్బుతం అయితే ప్రజాభిప్రాయం కొరమంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విసిరిన సవాలుకు, మీరు మీ మంత్రులు పత్తా లేకుండా పోయారు అని ఎద్దేవా చేశారు.

మాట తప్పము,మడమ తిప్పము అన్న జగన్మోహన్ రెడ్డి గారు, నాడు నిండు అసెంబ్లీలో అమరావతికి నేను సంపూర్ణ మద్దతు తెలువుతున్నాను. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటం ఇష్టం లేకని నేను అమరావతిని స్వాగతిస్తున్నా అని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రాన్ని అడగే ధైర్యం లేక ఉన్న రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి కాలం నెట్టుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి, పరిపాలన చేత కాక కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని విమర్శించారు.

అసలు ప్రపంచ మొత్తం కరోనా గుప్పిట బందీ అయిన ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలని కాపాడుకోవాల్సిన సమయంలో కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగటం హేయమైన చర్య అని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని,క్వారంటీన్ లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సాక్షాత్తు చికిత్స పొందుతున్న ప్రజలే వీడియోలు తీసి మీడియాకు పంపుతున్న దృశ్యాలు చూస్తుంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా అన్న అనుమానం కలుగుతోంది అన్నారు.

మీ పాలనలో ఎంత దురుద్దేశం లేకుంటే బెయిల్ పై ఇంటికి వచ్చిన 24 గంటల్లోనే మళ్ళీ తప్పుడు కేసు పెట్టి తిరిగి అరెస్టు చేస్తారని అని విమర్శించారు. కాలం అన్నిటికి సమాధానం చెప్తుందని అధికారం శాశ్వతం కాదని మదిలో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here