అలుపెరగని సైనికుడిలా పేదలకు సాయమందిస్తున్న”ప్రశాంత్ గౌడ్”

187

కరోనా మహమ్మారి దెబ్బకు ఆకలి బాదలతో ఇబ్బంది పడుతున్న సినీ కళాకారులకు పేదలకు, పట్టు వదలకుండా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , నిర్మాత సార్ధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ మార్చ్ 24 నుండి నేటి వరకు సాయమందిస్తూనే వున్నారు. ప్రముఖ స్వచ్చంద సేవా సంస్థ నారిసేన అధినేత్రి లతా చౌదరి సోజన్యంతో ఇప్పటివరకు 2000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రతిరోజు ఓ బాధ్యతగా భావించి 575 మంది నిరుపేదలకు ఫుడ్ ప్యాకేట్స్ పంచుతున్నారు.అలాగే పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు,డైలీ వేజ్ వర్కర్లు సుమారు 6000 మందికి ప్రతిరోజు బిస్కెట్ ప్యాకేట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే నిన్న పేద సినీ కళాకారులకు, వాచ్ మెన్లకు, హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ, ఇందిరా నగరాలలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ప్రశాంత్ గౌడ్. ఇలా ప్రతిరోజు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తు పేదల ఆకలి తీరుస్తున్న ప్రశాంత్ గౌడ్ మరికొందరికి ఆదర్శం కావాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here