హ్యాపీ బ‌ర్త్ డే ప‌రుశురామ్…!

ప‌రుశురామ్.. ఈ త‌రం ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. వాటితోనే ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప‌రుశురామ్. ముఖ్యంగా ర‌చ‌యిత‌గా గురువు పూరీనే మించిపోయే విధంగా పేరు తెచ్చుకుంటున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. యువ‌త లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ప‌రుశురామ్. హీరో నిఖిల్ కు సోలో హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఆ త‌ర్వాత ఆంజ‌నేయులుతో ర‌వితేజ‌లోని ఎన‌ర్జీని అదిరిపోయేలా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆంజ‌నేయులు చిత్రంలో ఈయ‌న‌ రాసిన కామెడీ చ‌మ‌క్కులు ఇప్ప‌టికీ పెదవుల‌పై చిరున‌వ్వు తెప్పిస్తాయి.

 

ఇక సోలో సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల్ని కూడా త‌న‌దైన రీతిలో అల‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. నారా రోహిత్ కు హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసాడు. అందులో మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా క‌థ‌ను న‌డిపిస్తూనే.. కుటుంబ విలువ‌ల‌కు పెద్ద‌పీట వేసాడు ప‌రుశురామ్. ఇక ర‌చ‌యిత‌గా ఆయ‌న ఇమేజ్ ను మ‌రింత ఎత్తుకు చేర్చింది సోలో. సారొచ్చారుతో ర‌వితేజ‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌టికి తీసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ త‌రం ద‌ర్శ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌ని పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ ను త‌న‌దైన రీతిలో చెప్పాడు ప‌రుశురామ్.

 

ఇక ఈ ఏడాది శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు ప‌రుశురామ్. ఈ సినిమాతో అల్లు శిరీష్ ను హీరోగా నిల‌బెట్టాడు ప‌రుశురామ్. ముఖ్యంగా ఆయ‌న‌తో చెప్పించిన డైలాగులు ప‌రుశురామ్ లోని ర‌చ‌యిత ప‌వ‌ర్ తెలియ‌జేస్తాయి. దేవున్ని కొంద‌రు ద‌గ్గ‌ర్నుంచి చూస్తారు.. కొంద‌రు దూరం నుంచి చూస్తారు.. ఆయ‌న మాత్రం అంద‌ర్నీ అక్క‌డ్నుంచే చూస్తాడు అని ప‌రుశురామ్ రాసిన కొన్ని డైలాగ్స్ సూప‌ర్ గాపేలాయి. గీతాఆర్ట్స్ లో శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి హిట్ సినిమా చేసిన ప‌రుశురామ్.. వెంట‌నే మ‌రో అవ‌కాశం అందుకున్నాడు. అంత ఈజీగా ఎవ‌రికీ రెండో అవ‌కాశం ఇవ్వ‌ని అల్లు అర‌వింద్.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి టాలెంట్ తెలిసి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేసాడు. ప్ర‌స్తుతం ఈయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రంతో ప‌రుశురామ్ మ‌రో ఘ‌న విజ‌యాన్ని అందుకోవాల‌ని ఆశిస్తూ.. ఈయ‌న ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆశిద్ధాం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *