రివ్యూ: దేవి శ్రీ ప్రసాద్

52


తారాగణం: పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, భూపాల్, ధన్ రాజ్, నల్ల వేణు, పోసాని కృష్ణ మురళి తదితరులు
సంగీతం: కమ్రాన్
నిర్మాత: డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్
రచన-దర్శకత్వం: శ్రీ కిశోర్
రేటింగ్: 3
ఈ మధ్య చిన్న సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కుతున్నాయి. పెద్ద సినిమాలన్నీ ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ తో ప్రేక్షకుల ముందుకు పోతుండగా… చిన్న సినిమాలను తీసే వారు మాత్రం కాన్సెప్టును నమ్ముకొని… సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఓ డిఫరెంట్ కాన్సె ప్టుతోనే మరో సినిమా మన ముందుకొచ్చింది. పూజా రామచంద్రన్, భూపాల్, మనోజ్ నందన్, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే మన ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: సినిమాల్లో హీరోయిన్ గా నటించే లీలా రామచంద్రన్(పూజా రామచంద్రన్) ఆకస్మత్తుగా ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. దాంతో ఆమెకు తీవ్రగాయాలు అవుతాయి. వెంటనే ఆసుత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెబుతారు. అయితే లీలా అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ వుంటుంది. ఆమె మరణాన్ని అదే ఆసుపత్రిలో పనిచేసే శ్రీ(ధన్ రాజ్) జీర్ణించుకోలేకపోతాడు. వెంటనే తన మిత్రులు దేవి(భూపాల్), ప్రసాద్(మనోజ్ నందన్)తో ఈ విషయాన్ని చెబుతాడు. వారు.. ఇది నిజమా కాదా అనే దాన్ని కన్ ఫర్మ్ చేసుకునేందుకు ఆసుపత్రిలో మార్చురీలో వున్న శవాన్ని చూసేందుకు వెళతారు. అక్కడికి వెళ్లగానే ఆమె అందాన్ని చూసి దేవి.. ఆమెను ఎలాగైనా అత్యాచారం చేయాలనుకుని.. తన మిత్రులు వారించినా వినకుండా అత్యాచారానికి పాల్పడుతాడు. ఈ క్రమంలో మరణించింది అనుకున్న లీలా రామచంద్రన్ కు మెలకువ వస్తుంది. అలా మెలకువలోకి వచ్చిన లీలా రామచంద్రన్ ను చూసి… తాను చేసిన అత్యాచారం గురించి ఎక్కడ బయట చెబుతుందోనని ఆమెను చంపాలనుకుంటాడు దేవి. మరి దేవి లీలాను చంపాడా? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే మిగతాకథ.

కథ.. కథనం: ఇలాంటి డిఫరెంటు కాన్సెప్టులు అప్ కమింగ్ దర్శకులకే వస్తాయి అనడంలో సందేహంలేదు. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అనే కాన్సెప్టుతో ఇలాంటి వాటిని రచన చేసి తెరకెక్కిస్తుంటారు. ఓ శవాన్ని అత్యాచారం చేయాలనే కోరిక కలగడం వింతగా వున్నా… అక్కడ చనిపోయింది ఓ అందమైన హీరోయిన్ అని.. ఆమె అందాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో ఓ కామాంధుడు చేసే ప్రయత్నం ఎలా వుంటుంది… అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇందులో చక్కగా చూపించారు. తనను తాను రక్షించుకునే క్రమంలో తన ప్రాణ స్నేహితులను సైతం చంపడానికి వెనుకాడని ఓ పాత్రను ఇందులో చూపించారు. ఇది బాగా కనెక్ట్ అవుతుంది.
మొదటి హాఫ్ లో హీరోయిన్ పై అత్యాచారం… ఆమెను ఎలాగైనా అంతమొదించాలని చూసే విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు… ఆ హత్యాయత్నానికి తోటి మిత్రలు నిరాకరించే సన్నివేశాలన్నీ ఎంతో ఉత్కంఠతను రేపి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇంతర్వెల్ తరువాత కూడా హీరోయిన్ ను చంపడానికి ట్రై చేసే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను ఊపిరిబిగబడ్డి చూసేలా చేస్తాయి. ఇలా ఎంతో ఉత్కంఠతతో సాగే పకడ్బంధీ కథనం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో హీరోయిన్ అత్యాచారానికి సంబంధించి.. అసలు ఏమి జరగలేదని ఓ కన్ క్లూజన్ ఇచ్చి ముగించడం బాగుంది.
దేవి పాత్రలో భూపాల్ చక్కటి రౌద్రాన్ని ప్రదర్శించాడు. తనను తాను రక్షించుకోవడానికి ఎంతటికైనా తెగించే పాత్రలో మెప్పించాడు. ముఖ్యంగా హీరోయిన్ శవంపై అత్యాచారానికి పాల్పడే పాత్రలో విలనిజాన్ని చూపాడు. తన మిత్రలు వారిస్తున్నా.. తన కోరికను తీర్చుకోవడానికి తోటి మిత్రులను సైతం లెక్కచేయని పాత్రలో బాగా నటించాడు. అలాగే అతనికి సపోర్టివ్ గా ధన్ రాజ్ కూడా సాధ్యమైనంత మేర మెప్పించడానికి ట్రై చేశాడు. అలానే మనోజ్ నందన్ కూడా తన వంతు నటించి మెప్పించాడు. ఇక పూజా రామచంద్రన్ గురించి చెప్పాల్సి వస్తే… సినిమా మొత్తం ఆమె మీదనే నడుస్తుంది. లీడ్ పాత్రను చక్కగా క్యారీ చేసింది ఈ తమిళ్ పొన్ను. విలన్ నుంచి తప్పించుకుని పారిపోడానికి ట్రై చేసే సన్నివేశాలన్నింటిలోనూ ఆమె నటన బాగుంది. ఇక మిగతా పాత్రలుపోషించిన పోసాని, నల్ల వేణు కూడా కాసేపు కనిపించినా బాగా నవ్వించారు.
దర్శకుడు శ్రీ కిశోర్ రాసుకున్న కథ.. కథనాలు బాగా ఎంటర్టైనింగ్ గానూ.. ఉత్కంఠతను రేపుతాయి. వైవిధ్యమున్న కథను ఎంచుకుని తనకున్న లిమిటెడ్ బడ్జెట్టులో సినిమాను యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. అలానే ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్. ఏమాత్రం పాటలు లేని ఈచిత్రానికి బీజీఎం మాత్రమే ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అలానే ఓ ఆసుపత్రిలో జరిగే సంఘటనను సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాను ఎడిట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించడంలో నిర్మాత కృషిని అభినందించి తీరాల్సిందే. ఇలాంటి కాన్సెప్టులు చేయాలంలే నిర్మాతలకు ధైర్యం వుండాలి. ఎంతో ధైర్యం చేసి నిర్మాతలు ఈ కథను తెరకెక్కించడానికి ముందుకు రావడాన్ని అభినందించాలి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here