రివ్యూ: ఆసక్తిని కలిగించే ‘దండుపాల్యం2’

600

రేటింగ్: 3.25
నటీనటులు: సంజన, పూజ గాంధీ, రవి శంకర్, మార్కండ్ దేశ్ పాండే తదితరులు
సంగీతం: అర్జున్ జన్య
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: శ్రీనివాస్ రాజు
కన్నడలో ఇటీవల డిఫరెంట్ జోనర్లలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా సహజత్వంతో కూడిన ఆసక్తిగొలిపే కథలకు అక్కడి నిర్మాతలు.. దర్శకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు… సినిమాలు కూడా తక్కువ బడ్జెట్టుతోనే తెరకెక్కడంతో మార్కెట్టు కూడా బాగుంటోంది. లిమిటెడ్ బడ్జెట్టుతో తెరకెక్కిన చిత్రాలను ఆడియన్స్ కు కూడా వెంటనే కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో వచ్చిన దండుపాల్యం చిత్రం ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘దండుపాల్యం2’ని తెరకెక్కించారు. ఇది ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. దాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తున్నారో చూద్దం పదండి.

స్టోరీ: మొదటి భాగంలో 80 హత్యలు… దోపిడీలు చేసి… పోలీసులకు నేరస్థులుగా పట్టుబడిన ఓ ఎనిమింది మంది ఆరేళ్లపాటు కోర్టులో విచారణ ఎందుర్కొంటారు. మొత్తం విచారణ అనంతరం.. వారికి కోర్టు మరణ శిక్ష విధిస్తుంది. ఇందులో ఓ మహిళ(పూజా గాంధీ)తో సహా 8మందికి ఉరిశిక్షపడుతుంది. అయితే ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేసే క్రైమ్ రిపోర్టర్ అభివ్యక్తి మాత్రం వాళ్ళు అమాయకులని నమ్మి ఆ కేసును సొంతంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది. అలా ఇన్వెస్టిగేషన్ కు దిగిన ఆమె తన విచారణను ఎలా కొనసాగించింది? ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఆమె అనుకుంటున్నట్టు దండుపాళ్యం గ్యాంగ్ నిర్దోషులేనా? అసలు వారి జీవితం మొదట్లో ఎలా ఉండేది? చివరకు వీరి జీవితం ఎలా అయింది? అనేది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
స్టోరీ విశ్లేషణ: దండుపాళ్యం మొదటి భాగంలో గ్యాంగ్ మొత్తం హత్యలు, దోపిడీలు చేస్తూ అందరినీ బయపెట్టడాన్ని, పోలీసులు నానా తిప్పలు పడి వాళ్ళను పట్టుకోవడాన్ని చూపించి దండుపాళ్యం పేరు చెబితేనే కరుడుగట్టిన హంతకులు గుర్తొచ్చేలా చేసిన దర్శకుడు శ్రీనివాస్ రాజు… రెండవ భాగంలో మాత్రం వాళ్ళసలు ఆ నేరాలు చేశారా చేయలేదా? పోలీసులే తప్పుడు సాక్ష్యాలతో వాళ్ళను ఇరికించారా? అనే అనుమానాన్ని రేకెత్తించి ఆరంభంలోనే సినిమాపై మంచి ఆసక్తి కలిగేలా చేశారు. సాధారణంగా ఇలాంటివి మన నిజ జీవితంలో చూస్తునే వుంటాం. అలాంటి కోణంలో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసి… చాలా రియల్ స్టిక్ స్టోరీకి ప్రాణం పోశాడని దర్శకుడిని అభినందించొచ్చు. ముఖ్యంగా పోలీసులు అమాయకులైన ఆ 12 మంది చేత చేయని తప్పును ఒప్పించడానికి చేసే ఇంటరాగేషన్ సన్నివేశాలు, చేతిలో డబ్బు లేక.. నా అనే వాళ్ళు లేని అభాగ్యులు పడే కష్టాలను చూపించిన విధానం చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. అలాగే సంజన, పూజ గాంధీ, రవి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రవి కాలే వంటి నటీనటులు చాలా సహజంగా నటించి ప్రేక్షకుల మనన్ననలు పొందారు. దర్శకుడు శ్రీనివాస్ రాజు తను అనుకున్న కథ.. కథనాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు కూడా దానికి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈచిత్రానికి నేపథ్య సంగీతం ప్లస్. అర్జున్ జన్య అందించిన సంగీతం ముఖ్య సన్నివేశాల్లో బాగుంది. వెంకట్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జైలు సన్నివేశాలు, విచారణ తీరును చూపించిన విధానం బాగుంది. నిర్మాత వెంకట్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here