చంద్రబాబు పరువు తీస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో ఆయా పార్టీ నాయకులే భారీ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్. టి. ఆర్. గృహ నిర్మాణ పథకం లో భారీ అవినీతి చోటుచేసుకుంది. ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికి ఆశించిన స్థాయి లో లబ్దిదారులకు న్యాయం జరగటం లేదు. ఎందుకా అని అనుకుంటున్నారా, టి. డి. పి. కార్యకర్తలే ఈ అవినీతికి పాల్పఫుతున్నారంటే ఈ పథకాన్ని ఏ స్థాయి లో నీరుగారుస్తున్నారో ఇట్టే అర్థమౌతుంది. ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక లబ్దిదారుడు నుండి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సొమ్ములో ఈ కార్యకర్తలే కనీసం 10% లంచం ఇమ్మంటున్నారంటే ఈ పథకం లో తెలుగు తమ్ముళ్లు ఎంత అవినీతి చేస్తున్నారో మనకు అర్థమౌతుంది. పాపం లబ్దిదారుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలి, చాలక అర్దాంతరంగా ఇల్లు నిర్మాణం ఆపు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ అవినీతి కుంభకోణాన్ని అదుపు చేయకపోతే ప్రజల ఆగ్రహాన్ని చంద్రబాబు చవి చూడవలసి వస్తుంది. ఏ ప్రభుత్వం లోనైన ముఖ్యమంత్రి తనకున్న ఆలోచన మేరకు అటు సంక్షేమం లో గాని ఇటు అభివృద్ధి లోగాని పూర్తి అవగాహనతో ముందుకి వెళ్తారు. ఇలాంటి అవినీతి కార్యకర్తల వలన ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా చెడ్డపేరు రావటం ఖాయమని పలువురు మేధావులు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యే బాబుగారు అవినీతి తమ్ములను మీరు ప్రోత్సహించడం వలన మీ వ్యక్తిగత ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థి కనిపిస్తుంది. ఇకనైనా మీరు ఇలాంటి స్వార్ధ పరులకు మీరు అవకాశాన్ని ఇచ్చి చేతులరా అధికారాన్ని వదులుకోవద్దని పలువురు రాజకీయ రంగ నిపుణులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *