చంద్రబాబుకు స్వదస్తూరితో లేఖ రాసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు స్వదస్తూరితో లేఖ రాసిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

లేఖలో సారాంశం :

ఆగస్ట్ 26న నేను అమరావతి వచ్చిన సందర్భంగా నాకు మీరు, మీ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు ప్రజలు అపూర్వ రీతిలో చేసిన పౌర సన్మానం ఎన్నటికీ మరువలేనిది. గన్నవరం విమానాశ్రయం నుంచి 26 కిలోమీటర్లు దారి పొడవునా వేలాది మంది విద్యార్థులు,ప్రజలు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు, దృశ్యాలు నాకు ఎప్పుడూ మన: పథం నుంచి చెరిగిపోవు.

నేను పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.25 లక్షలు మంజూరు చేస్తూ చివరి సంతకం చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సచివాలయం వద్ద ఇళ్ల పథకం ఫైలాన్ ను నాతో ఆవిష్కరింపజేయడం నాకు ఆనందం కలిగించింది. నేను రాజ్యాంగ పదవిలో ఉన్నా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నా తెలుగు నేలను, తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేను.

రాష్ట్ర అభివృద్ధికి నా పరిధిలో నాకు సాధ్యమైనంత కృషి చేస్తానని, సలహా, సహకారాలు అందిస్తానని పునరుద్ఘాటిస్తున్నాను. మీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను.

శుభాకాంక్షలతో

ముప్పవరపు వెంకయ్యనాయుడు
భారత ఉపరాష్ట్రపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *