రివ్యూ: ‘చిత్రాంగద’.. ఓ కామెడీ థ్రిల్లర్!

163

మూవీ: చిత్రాంగద
తారాగణం: అంజలి, జేపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సింధుతులానీ, రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు సంగీతం: సెల్వగణేష్-స్వామినాథన్
ఎడిటర్: ప్రవీణ్‌పూడి
కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ)
సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి
నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి
రేటింగ్: 3/5
పిల్లజమీందార్ ఫేం అశోక్ చాలా కాలం తరువాత ‘చిత్రాంగద’తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఒచ్చాడు. ఈ సినిమా చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ సమయంలోనే అశోక్.. అనుష్కతో ‘భాగమతి’ అనే సినిమాను కూడా పట్టాలెక్కించేసి… త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు. దాని కంటే ముందుగా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాంగదను ఈ రోజే మన ముందుకు తెచ్చారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం పదండి.
స్టోరీ: ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసే చిత్ర(అంజలి) ఆత్మల మీద పరిశోధన చేస్తూ వుంటుంది. అలా ఆత్మల మీద పరిశోధన చేసే క్రమంలో ఆమెను ఓ కల వెంటాడుతూ… హాస్టల్లోని తోటి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ వుంటుంది. దానంతటికీ కారణం… ఓ పాతికేళ్ల క్రితం అమెరికాలో ఆమె ఓ హత్యను చూడటమే అని… ఆ హత్య ఎవరు చేశారు? ఎవర్ని చేశారు? దాని వెనకున్న మిష్టరీ ఏంటనేదాన్ని ఛేదించడానికి చిత్రం అమెరికాకు బయలుదేరి వెళుతుంది. అలా వెళ్లిన చిత్రకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆమెకు కలలో వచ్చినది నిజమేనా? అలా అయితే అలా ఎందుకు చంపారు? అసలు చిత్ర ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్టోరీ విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. గత జన్మలో పురుషుడిగా వున్న ఓ వ్యక్తి… ఈ జన్మలో అమ్మాయిగా పుట్టి.. తన పగను ఎలా తీర్చుకుందనే థ్రిల్లర్ జానర్ ఇది. అంజలీ టైటిల్ రోల్ పోషించి.. అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని అలరించేసింది. మాస్ కావాల్సిన పాటలను ఫస్ట్ హాఫ్ లో చూపించేసి… ఇంటర్వెల్ ముందు ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ తో సెకెండాఫ్ ను ప్రారంభించేశాడు. ఇందులో అంజలీ చాలా బాగా నటించింది. సోలో సాంగ్స్లో అదరగొట్టేసింది. అక్కడక్కడ రౌద్రాన్ని కూడా పండించేసింది. ‘కిచాక్’ అంటూ మగరాయుడిలాగ ఆమె నటన మాస్ ను కచ్చితంగా అలరిస్తుంది.
అయితే ఇందులో ప్రధాన పాయింట్ బాగున్నా… దానిని డ్రైవ్ చేయడానికి కావాల్సిన స్క్రీన్ ప్లే మరింత వేగంగా వుండాల్సింది. ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ కి సెంటిమెంట్.. పాటలు లాంటి కమర్షియల్ హంగులు అవసరం లేదు. కానీ ఎందుకో ఈ సినిమాలో అవే ఎక్కవగా పుండటంతో.. కథను ముందుకు తీసుకుపోకుండా అడ్డుపడ్డాయేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ ను మాత్రం చాలా పకడ్బంధీగా తెరకెక్కించాడు. చివరిగంట.. సినిమా చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఒక్కో చిక్కుముడిని చాలా కన్వెన్సింగ్ గా విప్పుతూ క్లైమాక్స్ ను ముగించేశాడు. సింధు తులానీ ఎంటర్ అయినప్పటి నుంచి కథ వేగంగా ముందుకు వెళుతుంది.
దర్శకుడు అశోక్… లేడీ ఓరియంటెడ్ మూవీస్ ను ఎంచుకోవడం బాగుంది. అనుష్కతో ‘భాగమతి’ని కూడా తెరకెక్కిస్తున్నాడు. చిత్రాంగద మూవీ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అంజలీ అందాలు.. అక్కడక్కడ భయపెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అంజలితో పాటు సంయుక్త, స్వాతిదీక్షిత్ నటనతో పాటు.. వారి అందాలు మాస్ ను బాగా మెప్పిస్తాయి. చాలా కాలం తరువాత దీపక్ ఇందులోనటించాడు. క్లైమాక్స్ లో అతని నటన బాగుంది. అలానే జయప్రకాష్ కూడా బాగా నటించాడు. మిగతా పాత్రలన్నీ కథకు అనుగుణంగానే వున్నాయి. సప్తగిరి ఎపిసోడ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. బాలిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుపెట్టడంతో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here