అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలివీ

26

కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరాల్సిందేనని ఓ వైపు వైసీపీ, మరోవైపు జనసేన.. ఇంకోవైపు ప్రజాసంఘాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైసీపీ అధినేత జగన్- జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ అవిశ్వాస తీర్మానంపై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రంపై ఈ అవిశ్వాస తీర్మానమే చివరి అస్త్రమని సీఎం వ్యాఖ్యానించారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల రాజీనామాలతో ఉపయోగంలేదని సీఎం స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో నిరంతరం పోరాటం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీ ఎంపీలకు ఆయన సూచించారు. అప్పుడే మన పోరాటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here