బుర్రకథకు ప్రేక్షకుల నుండి మార్కులు పడ్డాయి.

138

ఆది సాయికుమార్, మిస్టి చక్రవర్తి జంటగా నటించిన బుర్రకథ సినిమా జులై 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా

రచయిత డైమాండ్ సినిమా విడుదలకు ముందే సక్సెస్ అయ్యాడు. జి.తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి. వింటేజ్ క్రియేషన్స్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ రకంగా చూసుకుంటే టీజర్, ట్రైలర్ తో దర్శకుడు డైమండ్ రత్నబాబు నిర్మాతను విడుదలకు ముందే సేఫ్ చేసాడు. రివ్యూలతో సంభంధం లేకుండా పబ్లిక్ టాక్ తో సినిమాకు జనాధారణ లభించింది. బుర్రకథ సినిమాకు మౌత్ టాక్ శ్రీరామ రక్ష. డైమండ్ రత్నబాబు మొదటి సినిమాను బాగా తీసినా, టేకింగ్ బాగా హ్యాండిల్ చేసినా, సినిమాలో కేవలం మీడియా పైన సెటైర్స్ వేయడంతో మీడియా నుండి వ్యతిరేకత ఎదురై, సరైన రివ్యూస్ లభించలేదని వినికిడి. బుర్రకథ మౌత్ టాక్ వల్ల మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

హీరో ఆది సాయికుమార్ తన కెరీర్ లొనే బెస్ట్ పెరఫార్మెన్స్ ఈ సినిమాలో కనబరిచాడు. సాయి కార్తీక్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా పనితనం రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ఫ్లస్ అయ్యాయి. తన మొదటి సినిమాతో టూ బ్రెయిన్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ డైమండ్ రత్నబాబు రెండో సినిమా కమర్షియల్ గా వెళతాడా ? మళ్లీ కొత్త కాన్సెప్ట్ తో వస్తాడా ? వేచి చూద్దా. కంగ్రాట్స్ టు బుర్రకథ టీమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here