Review: బ్లాక్‌మ‌నీ

204

BlackMoney-deccanfilm-2-1024x417 (1)Rating: 3.25

ప్రస్తుతం మోహన్ లాల్ హవా నడుస్తోంది. అందుకే ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోకి డబ్ అవుతున్నాయి. తాజాగా మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి `బ్లాక్‌మ‌నీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో అనువాద‌మై రిలీజ‌ైంది. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన జోషి ఈ చిత్రానికి దర్శకుడు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించే అవకాశముందో చూద్దాం.

కథ విషయానికి వస్తే… వేణు (మోహన్ లాల్) రాయిటర్స్ మీడియా ఏజెన్సీకి ఫ్రీలాన్స్ కెమెరామెన్ గా పనిచేస్తుంటాడు. దీంతో పాటు లోకల్ మీడియాకు కూడా వర్క్ చేస్తుంటాడు. వేణు ఫీల్డ్ లో ఉన్నాడంటే న్యూస్ సెన్సేషన్ అవ్వాల్సిందే. రేణు (అమలా పాల్) భారత్ విజన్ ఛానెల్ రిపోర్టర్. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆతర్వాత ప్రేమికులు. సరిగ్గా పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో రాజకీయనాయకుడు సిఎం రేసులో ఉన్న భవాని ప్రసాద్ కి సంబంధించిన ఓ వీడియోను షూట్ చేస్తారు. అయితే ఈ వీడియో విషయంలో వేణుని, రేణు మోసం చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోతారు. కానీ మరో న్యూస్ ఆపరేషన్ విషయంలో కలవాల్సి వస్తుంది. అయితే భవానీ ప్రసాద్ వేణు, రేణు కెరీర్ తో, ప్రాణాలతో ఆడుకుంటాడు.

ఇంతకూ… వేణు రేణు ఎలాంటి న్యూస్ ఆపరేషన్ చేసారు. వేణుని రేణు ఎలా మోసం చేసింది. భవాని ప్రసాద్ ని షూట్ చేసిన వీడియోలో ఏముంది. విడిపోయిన వేణు, రేణు మళ్లీ ఎందుకు కలిసి వర్క్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమాధానాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాలి.

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, స్క్రీన్ ప్లే. బ్లాక్ మనీ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఎక్కువగా మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయంగా జరిగే దందాల్ని బాగా చూపించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ సినిమా క‌థాంశం తిరుగుతుంది. అలాగే మీడియాలో జరిగే రాజకీయాల్ని కూడా బాగా చూపించారు. దర్శకుడు జోషి మీడియాను బాగా స్టడీ చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ ఫుల్ గా డీల్ చేశారు. ప్రథమార్థంలో మోహన్ లాల్ అమాలా పాల్ చేసే స్ట్రింగ్ ఆపరేషన్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని బాగా చూపించారు. రెండో భాగంలో భవానీ ప్రసాద్ చేయబోయే మర్డర్ గురించిన సీన్స్ ని బాగా ప్లాన్ చేశారు. ఈ సందర్భంలో ప్లాన్ చేసుకున్న స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రతీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా రాసుకున్నారు. సీనియర్ రైటర్ వెన్నెల కంటి దర్శకుడి ఆలోచనలు తగ్గట్టుగా తెలుగు డైలాగ్స్ ని అందించారు.

మోహన్ లాల్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరో కావడంతో కథకు బలం చేకూరింది. తనదైన పెర్ ఫార్మెన్స్ తో కథను తన భుజాలమీదేసుకొని ముందుకు తీసుకెళ్లాడు. అమలా పాల్ కి సైతం మంచి క్యారెక్టర్ లభించింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ స్టోరీకి లింక్ అయి ఉంటాయి కాబట్టి… బోర్ కొట్టవు. మీడియా రిలేటెడ్ కథ కావడంతో… జర్నలిస్టుల్ని బాగా స్టడీ చేసి యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. రితీష్ వెగా-అభిషేక్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

ఈ తరహా కథాంశాలు టెక్నికల్ గా మరింత స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేయి. కానీ సాదా సీదాగా తెరకెక్కించారు. తెలుగు టైటిల్ బ్లాక్ మనీ కూడా సరిగ్గా కుదరలేదు. ఇలాంటి చిన్న విషయాల్ని పక్కన పెడితే మంచి సినిమా. “జనతా గ్యారేజ్, మన్యం పులి” వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని తప్పక ఆకట్టుకుంటాడు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here