20 సంవత్సరాల ‘బద్రీ’..ఆరోజుల్లో అంటూ..రేణు ఙ్ఞాపకాలు

136

పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం బద్రి. రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ మూవీ వచ్చి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తైంది. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలోనే పవన్, రేణు మధ్య ప్రేమ చిగురించగా.. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన వారు 2009లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వలన 2012లో విడిపోయారు. ఇది పక్కనపెడితే.. హీరోయిన్ గా రేణుకు తెలుగులో ఇది మొదటి చిత్రం కాగా.. అప్పటి సంభాషణలను, ఘటనలను ఆమె గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్న రేణు.. వాటికి సంబంధించిన సందర్భాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఓ ఫొటోకు ఇది జరిగి 20 ఏళ్లు అవుతుంది. కానీ అప్పుడు మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.. ఎందుకంటే మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్‌ ఈ ఫొటోను తీశారు అని రేణు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఓ నెటిజన్‌ ఆమెను ఉద్దేశించి కాస్త ఇబ్బందికర కామెంట్‌ చేశాడు. దీనిపై రేణు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌కు కూడా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here