• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఇక విజన్ 2047 వస్తే సంపూర్ణ విధ్వంసమే…

admin by admin
August 16, 2023
in politics
0 0
0
ఇక విజన్ 2047 వస్తే సంపూర్ణ విధ్వంసమే…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

-బాబు విజన్ 2020 తో రాష్ట్రం ధ్వంసం

చంద్రబాబులో ఉండే ఓ లక్షణం ఏమంటే ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని, తాను ఏది చెబితే అది గొప్ప అని, తాను ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేసి ముంచగలను అనేది అయన విశ్వాసం. తానూ తన మీడియా తలచుకుంటే ప్రజలను ఎన్నిసార్లయినా నమ్మించి వెర్రివాళ్లను చేయగలను అనేది అని ప్రగాఢ నమ్మకం. అందుకే అప్పట్లో ఇరవయ్యేళ్ళ క్రితం తాను విజన్ – 2020 అంటూ అదేదో అద్భుతమైన కాన్సెప్ట్ అని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దొమ్మరిగుడిసెలు.. ఈ సామెత చంద్రబాబుకు సరిపోయినట్లు ఈ భూమ్మీద ఎవరికీ సూట్ అవ్వలేదు. ఆయన తనకు విజన్ ఉందని అంటారు.. చేసేవన్నీ వ్యవస్థలను ముంచేసే పనులు.. గుడ్డి నిర్ణయాలు. కానీ ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అంటూ మళ్లీ ప్రజలముందుకు వస్తున్నారు. అప్పట్లో విజన్ 2020 అంటూ వచ్చిన చంద్రబాబు చేసిందేమిటి ? ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమిటి ? వ్యవస్థలనుం ఎలా ముంచేశారు ? ఎలా అమ్మేశారు.. ఒక్కసారి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూద్దాం..

పరిశ్రమమల అమ్మకాలు

తనను తానొక సీఈవోగా ఊహించుకునే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారు. అయ్యో ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి .. వాటిని ప్రభుత్వం ఎందుకు నడపాలి అంటూ తన మద్దతుదారులైన మీడియా సంస్థల్లో రోజూ వార్తలు రాయిస్తారు. అయ్యో పాపం అనేలా ప్రజల్లో అభిప్రాయాలు కలిగిస్తారు. చివరికి అది అమ్మేస్తే మనకు భారం పోతుంది అనేలా జనంలోకి ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకు వెళ్తారు. మొత్తానికి మన మేధావి వాటిని అమ్మేసి మన రాష్ట్రానికి భారం తగ్గించారు.. అని జనంతోనే చెప్పిస్తారు. ఈ విధంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 54 సంస్ధలను అమ్మేశారు. అది కూడా తన అనుచరులు, తన బినామీలకు పావలాకు అర్ధరూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారు ఈ విజనరీ

విద్యుత్ చార్జీల పెంపు, బషీరాబాగ్ కాల్పులు

కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసి, ప్రజలను గాలికి వదిలేసినా చంద్రబాబు ఆ ప్రపంచ బ్యాంకు డైరెక్షన్ మేరకు విద్యుత్ చార్జీలు భారీగా పెంచారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆందోళన చేశారు అది కాస్తా కాల్పులకు దారితీయగా ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బషీర్ భాగ్ విద్యుత్ ఉద్యమ కాల్పులు పేరిట చరిత్రలో బలంగా నిలిచిపోయింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఈయన చలవే

అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ? అంతేసి జీతాలు దేనికి అనే భావనలో ఉండే చంద్రబాబు రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారు. తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు. అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులు ఈ అవుట్ సోర్సింగ్ కుర్రాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారు. ఇప్పటికీ అదే అవుట్ సోర్సింగ్ విధానం ఆంధ్రాలో కొనసాగుతోంది. వీరి జీవితాలు చివరివరకూ అదే తక్కువ జీతాలతో కొనసాగక తప్పని పరిస్థితి

ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు

అసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత సేవలు ఎందుకు? ఎంతోకొంత యూజర్ చార్జీలు వసూలు చేద్దాం అనే ఆలోచనలో రోగుల నుంచి సైతం కొంత ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. దీంతో ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేస్తూ వస్తున్నారు.

బాబు జమానా అవినీతి ఖజానా

: చంద్రబాబుతో అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిష్టు నాయకులూ సైతం చంద్రబాబు దాష్టీకాన్ని , కార్పొరేట్ తరహా పనులను భరించలేక, అయన అవినీతిని కప్పి పుచ్చలేక బాబు జమానా అవినీతి ఖజానా అంటూ పెద్ద పుస్తకమే రాశారు. ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనేదాన్ని స్పష్టంగా వివరించారు.

విద్య ప్రయివేటీకరణ

అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ నాశనం అయింది. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేవు.. కొత్త భవనాల నిర్మాణం అడ్మిషన్లు తగ్గిపోయాయి. అదే సమయంలో లక్షలు పోస్ట్ తప్ప అక్షరం నేర్పని కార్పొరేట్ స్కూళ్ళు వీధివీధినా వెలిశాయి. మధ్యతరగతివాళ్ళు సైతం అప్పు చేసి అయినా సరే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి. అంతేకాకుండా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ తన కార్పొరేట్ తరహా భావాలను అయన మనసులోని మాట అనే పుస్తకంలో ఘనంగా ప్రస్తావించారు.

ఇలాంటి అరాచక భావాలు, అబద్ధాలు, వ్యవస్థలను ధ్వంసం చేసే చంద్రబాబు తీరును చూసిన స్వీట్ జర్ లాండ్ ఆర్ధికమంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ ఇలాంటి అబద్ధాలకోరులను మా దేశంలో ఐతే జైల్లో కానీ , పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళం అన్నారు. అంటే చంద్రబాబు పాలనా ఏ మాదిరిగా ఉందో అర్థం అవుతోంది.

ఏది విజన్ ..?

చంద్రబాబు నిజంగా విజనరీ అయితే రాష్ట్రం విడిపోయి అప్పటికే అప్పులు, అవస్థల్లో ఉన్న ఆంధ్రకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకు ? లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? ఇప్పటీకే అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా. రోడ్లు, రైలు మార్గాలు.. విమానమార్గాలు ఉన్న నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే అదే రాజధాని అయ్యేది కదా.. అది లేకుండా లక్షలకోట్ల ఖర్చయ్యే అమరావతి రాజధాని అంటూ మూడు పంటలు పండే పచ్చని భూములులను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మారుస్తారా ? ఇదేనా విజన్ ?

ఆంధ్రకు అత్యంత పొడవైన తీరరేఖ ఉంది. అక్కడ పరిశ్రమలు… సముద్ర ఆధార వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి… రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. మరి అంట గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క పోర్ట్ అయినా కట్టారా ? అదేనా విజన్ ? ఏమీ అనుభవం లేదు అని చంద్రబాబు తరచూ విమర్శించే జగన్ ఎన్ని పోర్టులు కడుతున్నారు. ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు.. ఇది కాదా విజన్.

చంద్రబాబుకు నిజంగా ప్రజల మీద ఎలాంటి ప్రేమ, బాధ్యత లేదు.. ఎంతసేపూ తన అనుచరులు, అనుయాయుల లబ్ది, వారికి దోచిపెట్టడం మినహా వేరే ఆలోచన లేదు.

Tags: Babu's vision 2020 will destroy the state
Previous Post

Yuvan Creates a Magical Melody Suttamla Soosi for Vishwak Sen’s Gangs of Godavari

Next Post

పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం

Next Post
పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం

పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రౌద్ర రూపాయ న‌మః ఫ‌స్ట్ సింగిల్ విడుదల
movies

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రౌద్ర రూపాయ న‌మః ఫ‌స్ట్ సింగిల్ విడుదల

by admin
September 24, 2023
0

...

Read more
‘ఘోస్ట్’ నుండి హై ఓల్టేజ్ ‘ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ ‘ విడుదల

‘ఘోస్ట్’ నుండి హై ఓల్టేజ్ ‘ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ ‘ విడుదల

September 22, 2023
కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం

కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం

September 20, 2023
ద‌ర్శ‌కుడుగా నాకు రాజ‌మౌళి గారే ఆద‌ర్శంః ద‌ర్శ‌కుడు రాము కోన‌

ద‌ర్శ‌కుడుగా నాకు రాజ‌మౌళి గారే ఆద‌ర్శంః ద‌ర్శ‌కుడు రాము కోన‌

September 19, 2023
‘’స్కంద’ నుండి “కల్ట్ మామా” సాంగ్‌ విడుదల

‘’స్కంద’ నుండి “కల్ట్ మామా” సాంగ్‌ విడుదల

September 18, 2023
రియల్ స్టార్ ఉపేంద్ర విడుదల చేసిన ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్

రియల్ స్టార్ ఉపేంద్ర విడుదల చేసిన ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్

September 16, 2023
అక్టోబర్ 6న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ విడుదల

అక్టోబర్ 6న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ విడుదల

September 14, 2023
ఉత్కంఠ రేపేలా ‘సోదర సోదరీమణులారా…’ థియేట్రికల్ ట్రైలర్. వినాయక చవితి కి సెప్టెంబర్ 15న సినిమా గ్రాండ్ రిలీజ్

ఉత్కంఠ రేపేలా ‘సోదర సోదరీమణులారా…’ థియేట్రికల్ ట్రైలర్. వినాయక చవితి కి సెప్టెంబర్ 15న సినిమా గ్రాండ్ రిలీజ్

September 10, 2023
ఇది కదా పాలన అంటే…

ఇది కదా పాలన అంటే…

September 8, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In