యూత్ ను మెప్పించే ‘బీటెక్ బాబులు’


యూత్ ను బేస్ చేసుకుని తెరకెక్కించే సినిమాలు వెండితెరమీద హిట్టుకొట్టాయి. అందులోనూ కాలేజీ లవ్ స్టోరీ నేపథ్యం వున్న సినిమాలు బాగా ఆకట్టుకుంటాయి. అందుకు కొంచెం ఎమోషన్… కొంచెం లవ్ టచ్ ఇస్తే చాలు యూత్ కనెక్ట్ అయిపోతుంది. ఈ రోజు విడుదలైన ‘బీటెక్ బాబులు’ చిత్రం కూడా అలాంటిదే. ఇందులో శ్రీముఖి, నందు ప్రత్యేకపాత్రలు పోషించారు. ఈ సినిమా మరి యూత్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ.. కథనం విశ్లేషణ: ఓ వైపు బీటెక్ చదువుతూనే.. మరో వైపు ప్రేమలోనూ గెలుపొందాలనే యువకుల కథే ఇది. చదువు.. ప్రేమ.. బాధ్యత ఈ మూడింటి మధ్య నలిగిపోయే యువకులు.. చివరకు తమ గోల్ ను అచీవ్ చేశారా లేదా అనేది క్లైమాక్స్. ఇందులో అనేక ట్విస్టులు.. సెంటిమెంటు వున్నాయి. వాటన్నింటినీ ఏర్చి కూర్చి తెరకెక్కించాడు దర్శకుడు. ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ గా సాగే బీటెక్ బాబులు కథ.. కథనాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇందులో నటీనటుల విషయానికొస్తే….
పెళ్ళిచూపులు త‌ర్వాత నందు చాలా మంచి పాత్రలో కనిపించాడు. అతని పాత్ర ప్ర‌తీ ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీ ముఖి మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాకు వారిద్దరు ప్రధాన బలం. కథ, కథనం దర్శకుడు ఎంత బాగా డిజైన్ చేసుకున్నోడో… నందు శ్రీముఖి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అంత బాగా ప్లాన్ చేసుకున్నాడు. దర్శకుడు అవ్వాలనే తపనతో బతుకుతున్న నందు శ్రీముఖి ప్రేమించుకుంటారు. కెరీర్ ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రలివి. వీరిద్దరూ చాలా సహజంగా నటించారు. వారి మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్ గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే…న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్ గా ఉండేలా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరకెక్కించారు. ఆలీ స్పూఫ్ మరో ఎస్సెట్. కామెడీకి మంచి స్కోప్ ఉండేలా ఈ స్పూఫ్ ఉంది. స‌రైనోడు స్పూప్ అద‌రొట్టాడు. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభ‌వం గ‌ల డైరెక్ట‌ర్ లా క‌థ‌ను డీల్ చేశాడు. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్ధుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్ గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్ప‌దా? త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్ప‌దా? అనే అంశాల‌కు హాస్యం..సెంటిమెంట్ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించారు. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది. సినిమా క్వాలిటీ పరంగా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం అనే పాత్రలో షకలక శంకర్ క్యారెక్టర్ హిలేరియస్ గా ఉంటుంది. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది. ఇందులో ద‌ర్శ‌కుడు చిన్న చిన్న చిరంజీవి స్టెప్పులు కూడా వేయించారు. స్నేహితుల మధ్య వచ్చే సెంటిమెంట్ స‌న్నివేశాలు హైలైట్ గా తీర్చిదిద్దారు.
తాగుబోతు రమేష్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇందులో తాగుబోతు గానే కాకుండా కామెడీ దొంగగా పూర్తి స్థాయిలో కనిపించాడు. ఆనందో బ్రహ్మ తర్వాత రంగా ది దొంగగా అంద‌ర్నీ మెప్పించాడు. వైజాగ్ శంక‌ర్, వైవా హ‌ర్ష‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాశ్, నోవ‌ల్ కిషోర్, రాణి, ఖుష్బు, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో మెప్పించారు. ఇంజినీరింగ్ కాలేజ్ లో జంటలుగా నటించిన వారంతా చాలా బాగా చేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్ ఈసినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
యువతకు మంచి మెసేజ్ ఇచ్చేసినిమా ఇది. లవ్ తో పాటు కెరీర్ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పే చిత్రం. దీంతో పాటు ప్రేమలోని స్వచ్ఛతను చూపించారు. దర్శకుడు చాలా బాగా డీల్ చేయగలిగాడు. చాలా మంది కొత్తవారైనప్పటికీ చాలా బాగా నటించారు. ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ లు చాలా సహజంగా అనిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఓవరాల్ గా యూత్ ని మెప్పించే బిటెక్ బాబులుగా నిలిచారు. యూత్ కి మంచి ఛాయిస్ ‘బీటెక్ బాబులు’. గో అండ్ వాచ్ ఇట్!

రేటింగ్: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *