రివ్యూ: అరకు రోడ్డులో… అంతా థ్రిల్లే!

244

రేటింగ్: 2.75/5
నటీనటులు: సాయి రామ్ శంకర్, నికీషా పటేల్, పంకజ్ కేసరి, నీల్యా భవాని, పృథ్వీ, కోవై సరళ, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్
సినిమాటోగ్రఫీ: జగదీష్
నేపథ్య సంగీతం: సాగర్ మహతి
నిర్మాతలు: బాలసుబ్రమణ్యం, వేగిరాజు ప్రసాద్ రాజు, బచ్చు భాస్కర్, రామేశ్వరి నక్క
రచన, దర్శకత్వం: వాసుదేవ్
143.. బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్… తాజాగా ‘అరకు రోడ్డులో…’ లాంటి థ్రిల్లర్ తో మన ముందుకొచ్చాడు. ఇందులో ఎలాంటి హీరోయిజం చూపించకుండా కేవలం తన సహజనటనతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేశాడు. మరి ఆ అరకు రోడ్డులో ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ కలుగుతుందో చూద్దామా?
స్టోరీ: పోతురాజు(సాయిరామ్ శంకర్) ఓ ట్రక్కు డ్రైవర్. అతనికి ఓ మేనకోడలు ఐశ్వర్య అనే చిన్నారి వుంటుంది. ఆ చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతుంది. చిన్నారి బ్రెయిన్ కు అపరేష్ చేయాలని.. వెంటనే రూ.5 లక్షలు సమకూర్చుకోవాలని వైద్యులు చెబుతారు. దాంతో పోతురాజు కొంత డబ్బు సేకరిస్తాడు. అయితే పోతురాజు బావ… ఈ డబ్బుతో పేకాట ఆడి… మిగతా డబ్బును పోగేద్దాం అంటాడు. అయితే మొత్తం డబ్బు విలన్ గ్యాంగ్ చేతిలో పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో వుంటాడు పోతురాజు బావ. తన బావను వెతుక్కుంటూ పోతురాజు క్లబ్ కు వస్తాడు. అదే సమయంలో విలన్(అభిమన్యుసింగ్) ఓ ముగ్గురు వ్యక్తులను క్లబ్బులో అతి కిరాతకంగా చంపేస్తాడు. ఆ సంఘటనను చూసిన పోతురాజు.. భయంతో వణికిపోతాడు. తాను అక్కడికి తన బావను వెతుక్కుంటూ వచ్చానని… తన మేన కోడలు చావుబతుకుల మధ్య పోరాడుతోందని… పేకాటలో గెలుచుకున్న డబ్బు తిరిగిస్తే వెళ్లిపోతామని చెబుతాడు పోతురాజు. దానికి విలన్… తాను చంపేసిన ముగ్గరు వ్యక్తుల శవాలను ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా దూరంగా పడేసి వస్తే… ఆ రూ.5లక్షలు ఇస్తానని కండీషన్ పెడతాడు. దాంతో పోతురాజు ఆ మూడు శవాలను వేసుకుని అరకు రోడ్డుకు వెళతాడు. మరి పోతురాజు ఆ మూడు శవాలను మాయం చేశాడా? విలన్ గ్యాంగ్ పోతురాజుకు రూ.5 లక్షలు ఇచ్చిందా? శవాలను మాయం చేయడంలో పోతురాజుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: ఓ వాస్తవిక సంఘటన ఆధారంగా ‘అరకు రోడ్డులో…’ మూవీని ఓ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నామని చిత్ర బృదం ముందు నుంచే ప్రచారం చేసింది. దాంతో ఇందులో పెద్దగా యాక్షన్ సీన్స్… రొమాంటిక్ సన్నివేషాల్లాంటివేమీ వుండవని ఫిక్స్ చేసేశారు. ఓ థ్రిల్లర్ మూవీలానే చూడాలని ముందుగా చెప్పేయడంతో ప్రేక్షకులు కూడా అదే మూడుతో థియేటర్ కు వెళితే.. థ్రిల్ కలగడం ఖాయం. ఎందుకంటే… రియల్ గా జరిగిన ఓ సీరియల్ కిల్లర్ ను బేస్ చేసుకుని కథ రాసుకున్నాడు దర్శకుడు. దానినే ఓ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సెకెండాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా నడిపించాడు దర్శకుడు.
సాయిరామ్ శంకర్ కూడా తన నాచురల్ నటనతో మెప్పించాడు. సీరియల్ కిల్లర్ గా జిన్నా పాత్రలో భోజ్ పూరి నటుడు పంకజ్ చక్కగా నటించాడు. రిస్క్ రసూల్ పాత్రలో పృథ్వీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. అయితే ఈ పాత్రను మరింత బాగా డెవల్ చేసింటే ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు. హీరోయిన్ గా నటించిన నికీషా పటేల్… పాత్ర కొంత సేపే అయినా.. మగరాయుడి పోలీస్ పాత్రలో పర్వాలేదనిపించింది. ఇక పోలీసు పాత్రలో నటించిన ‘ఆవకాయి బిర్యానీ’ఫేం కమల్ కామరాజు పాత్ర కూడా పర్వాలేదు.
ఈ చిత్రానికి ఆయుపట్టు కథ. ఆ కథ.. కథనం ప్రీ క్లైమాక్స్ దాకా బాగానే ఎంగేజ్ అయింది. దానికి నేపథ్య సంగీతం బాగా కలిసొచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడు కావడంతో ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ గానే మూవీని ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు ఎంతో రిచ్ గా సినిమాటోగ్రఫీ వుండటం కూడా సినిమాకి ప్లస్ అయింది. ప్రతి సీన్ ను సినిమాటోగ్రాఫర్ రిచ్ గా చూపించాడు. సినిమా రన్ కూడా రెండు గంటలే కావడంతో ప్రేక్షకులకు కొంత రిలీఫ్. అలానే నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here