మన రోడ్లపైనే జగన్, పవన్ నడుస్తున్నారు: లోకేష్

13

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనం వేసిన రోడ్లపైనే నడుస్తున్నారని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అనంతపురం, నంద్యాల, కడపలో బూత్‌ కమిటీల ఏర్పాటులో లోపాలున్నాయని త్వరలో తగు చర్యలు తీసుకుంటామన్నారు.13 పార్లమెంట్‌ స్థానాల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించామని మంత్రి చెప్పుకొచ్చారు. సాధికారమిత్రల తరహాలో సేవా మిత్రలు వేస్తున్నామన్నారు.బూత్‌ కమిటీలకు, సేవామిత్రలకు శిక్షణ ఇస్తామన్నారు. అయితే నారా లోకేష్ వ్యాఖ్యలపై పవన్, జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here