బిజెపి,వైసీపీ,జనసేన మూడు పార్టీలు తోడుదొంగలు; ఏపీ మంత్రి దేవినేని

42

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వటమే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారంనాడు జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో మంత్రి ఉమా మీడియాతో మాట్లాడుతూ..గోదావరి డెల్టా మూడో పంటకు కూడా నీరు ఇస్తామని, ఇప్పటివరకు ప్రాజెక్టులకు 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గోదావరి జలాలు సద్వినియోగం చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు మంత్రి ఉమా మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలే వైసీపీ బీజేపీ నేతల గా రూపాంతరం చెందుతున్నారన్నారు. బిజెపి వైసీపీ జనసేన మూడు పార్టీలు తోడుదొంగలని, బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లుగా మంత్రులుగా ఉండి ఏపీకి ఏం చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ రెడ్డి కి బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి రారని, పార్లమెంట్ కు ఎంపీలు వెళ్ళరని, దేనికి రాష్ట్ర ప్రయోజనాల అవసరం లేదని మంత్రి ఉమా దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here