రాష్ట్ర కోసం 24 గంటలు కష్టపడుతున్నా..చంద్రబాబు

15
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు తాను కష్టపడి పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 24 గంటలూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో భాగస్వామ్య సదస్సు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సదస్సులో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు.
భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులపై కుదిరిన అవగాహన ఒప్పందాల వివరాలు..
* పరిశ్రమల రంగంలో రూ.2.1లక్షల కోట్ల పెట్టుబడితో 91 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీంతో 10లక్షల మందికి ఉపాధి అవకాశాలు
* ఇంధన రంగంలో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులతో 47 ఎంవోయూలు. 86వేల మందికి ఉపాధి అవకాశాలు.
* ఎపీసీఆర్డీఏతో రూ.1.24లక్షల కోట్ల పెట్టుబడికి 62 ఎంవోయూలు. 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు.
* మైనింగ్‌ రంగంలో రూ.11,113 కోట్ల పెట్టుబడితో 50 ఎంవోయూలు. 17వేల మందికి ఉపాధి అవకాశాలు.
* ఆహారశుద్ధి రంగంలో రూ.6055 కోట్లపెట్టుబడులతో 177 ఎంవోయూలు. 60వేలమందికి ఉపాధి అవకాశాలు.
* పర్యాటక రంగంలో 7237 కోట్ల పెట్టుబడితో 69 ఎంవోయూలు. 50వేల మందికి ఉపాధి అవకాశాలు
* ఐటీరంగంలో 4813 కోట్ల పెట్టుబడితో 67 ఎంవోయూలు. 47వేల మందికి ఉపాధి అవకాశాలు.
* రోడ్లు భవనాల శాఖలో రూ.74వేల కోట్ల పెట్టుబడితో అవగాహన ఒప్పందం.
* టౌన్‌షిప్‌ వసతుల కల్పనకు రూ.40వేల కోట్ల పెట్టుబడితో 14 అవగాహన ఒప్పందాలు. 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు.
* ఏపీఈడీసీ ద్వారా రూ.3,62,662 కోట్ల పెట్టుబడితో 66 అవగాహన ఒప్పందాలు.
* నైపుణ్యాభివృద్ధిలో రూ.3వేల కోట్ల పెట్టుబడితో 3 ఎంవోయూలు.
* జౌళిరంగంలో రూ.521 కోట్ల పెట్టుబడితో 8 ఎంవోయూలు. 18,550 మందికి ఉపాధి అవకాశాలు.
* ఉన్నత విద్యారంగంలో రూ.16,706 కోట్లతో 9 ఎంవోయూలు. 1.52లక్షల మందికి ఉపాధి అవకాశాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here