నేను కూడ సీమ బిడ్డనే…నాపై విమర్శలు చేసేవారు గుర్తుపెట్టుకోవాలి!

29


తానూ రాయలసీమ బిడ్డనే అనే విషయాన్ని విమర్శలు చేసేవారు గుర్తుపెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన ఈ రోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా నిన్న ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ అంశాన్ని పార్టీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించారు.గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాయలసీమకు చేశామనే విషయం ప్రజలకు తెలుసని సీఎం అన్నారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామన్నారు. అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది తెదేపా ప్రభుత్వమేనని ప్రజలు గుర్తించారని చంద్రబాబు నేతలతో అన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అలాగే, నేతలు అనురించాల్సిన వైఖరిపై సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలన్న ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా, పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టంచేశారు. దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. భాజపా నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని సూచించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం తప్పలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here